IndiGo CEO: ఇండిగోకు సీఈవో గుడ్ బై-ఆకస్మిక రాజీనామా వెనుక ?

మూడు నెలల క్రితం ఇండిగో (indigo)ఎయిర్ లైన్స్ లో తలెత్తిన సంక్షోభం, వారాల పాటు విమానాలు సక్రమంగా రాకపోకలు సాగించలేక ఎయిర్ పోర్టులకే పరిమితం కావడం చూశాం. దీంతో దేశవ్యాప్తంగా ఇండిగోపై విమర్శల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ, కేంద్రం జోక్యం చేసుకున్నా ఏమీ చేయలేకపోయారు. దీంతో వారు కూడా విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ఇదంతా జరిగి మూడు నెలలు అవుతుండగా.. ఇవాళ అర్ధాంతరంగా సంస్థ సీఈవో (Indigo CEO) పీటర్ ఎల్బెర్స్ రాజీనామా సమర్పించారు.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారని, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియాను కంపెనీ వ్యవహారాల నిర్వహణకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారని సంస్ధ ఇవాళ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇండిగో సంస్థ భారీ విమాన అంతరాయాలను ఎదుర్కొని కనీసం 3 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాల మధ్యలో చిక్కుకుపోయిన మూడు నెలల తర్వాత ఎల్బర్స్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఎండీ రాహుల్ భాటియాకు లేఖ రాశారు. డీజీసీఏ ఇప్పటికే ఇండిగోపై 22.20 కోట్ల పైన్ కూడా విధించింది.

IndiGo CEO Pieter Elbers Quits Abruptly Three Months After Airline Crisis

ఇవాళ జరిగిన సమావేశంలో ఇండిగో కంపెనీ డైరెక్టర్ల బోర్డు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఇవాళ బిజినెస్ టైం ముగిసిన తర్వాత ఆయన కంపెనీ నుంచి రిలీవ్ అవుతారంటూ వెల్లడించింది. ఆయన స్ధానంలో ఎండీ రాహుల్ భాటియా తాత్కాలికంగా కంపెనీ వ్యవహారాల నిర్వహణ బాధ్యతలు చేపడతారని కూడా వెల్లడించింది. 2022 సెప్టెంబర్‌లో ఇండిగోలో బాధ్యతలు చేపట్టిన ఎల్బర్స్, గత ఏడాది డిసెంబర్‌లో ఇండిగో అత్యంత దారుణమైన సంక్షోభం దాని పరువంతా తీసినప్పటి నుంచీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ సంక్షోభం విలువ 2 వేల కోట్లుగా ఇప్పటికే నిర్ధారణ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+