విమానంలో ఐస్ నినాదాలు: బెంబేలెత్తిపోయారు
కొచ్చి: గాలిలో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన ఉగ్ర నినాదాలు ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేశాయి. మిగితా ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. దీంతో విమానాన్ని దారి మళ్లించారు.
వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి కొచ్చి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి ఐఎస్‌ఐఎస్ అంటూ గట్టిగా నినాదాలు చేసి విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశాడు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించాల్సి వచ్చింది. అనంతరం ముంబయి ఎయిర్‌పోర్ట్ పోలీసులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత విమానంతిరిగి కొచ్చి బయలుదేరింది.












Click it and Unblock the Notifications