దేవుడా.. మరో ఘోరం.. పైలట్ నుంచి మే డే.. మే డే కేకలు.. అత్యవసర ల్యాండింగ్..!

దేశంలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజూ చాలా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం.. లేదా అత్యవసర ల్యాండింగ్ కావడం జరుగుతోంది. తాజాగా మరో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. గువహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

గువహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఇంధనం తక్కువగా ఉండటం వల్ల పైలట్ మే డే కాల్ ప్రకటించారు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) విభాగానికి సిగ్నల్ ఇచ్చారు.

మే డే.. మేడే.. ఫ్యూయల్ డౌన్ సంకేతం ఇవ్వడంతో వెంటనే ATC అప్రమత్తం అయింది. విమానాశ్రయంలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో వాళ్లు విమానం ల్యాండింగ్ అయిన ప్రాంతానికి మెడికల్, ఎమర్జెన్సీ కిట్స్ తో వెళ్లారు. అయితే విమానం సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణ సమయంలో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

IndiGo s Guwahati-Chennai Flight Diverted to Bengaluru After Mayday Call

భారత్ లో ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ విమానం కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. అంతేకాక ఇటీవల అనేక విమానాలు సాంకేతిక సమస్యలతో రద్దయ్యాయి. దీంతో విమాన ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+