బడ్జెట్: 70 ఏళ్ళుగా ఆ రికార్డు ఇందిరాగాంధీదే
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా ఇంధిరాగాంధీ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆమెపై అలానే ఉంది.70 ఏళ్ళుగా ఈ రికార్డు అలానే ఉంది. 1969లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ప్రధాన మంత్రిగా ఉంటూ ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్‌పై ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బడ్జెట్ తయారీ సమయంలో ఆ వివరాలు బయటకు వస్తే ఆ మంత్రి రాజీనామా చేసిన ఘటనలు కూడ లేకపోలేదు. కానీ, ఇండియాలో ఇంతవరకు ఆర్థిక మంత్రిగా ఉంటూ ఏ మహిళ కూడ ఇందిరాగాంధీ మినహ మరెవరూ కూడ బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కు అధికంగా ప్రాధాన్యతను ఇస్తాయి. బడ్జెట్ పై ప్రజలు కూడ ఆసక్తిగా చూస్తాయి. బడ్జెట్ తర్వాతే సరుకుల ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో తేలనుంది.

బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఇందిరా గాంధీ
1969లో ఇందిరాగాంధీ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దీంతో బడ్జెట్ ను ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రిగా ఉంటూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చరిత్ర ఆమెపైనే ఉంది. ఇప్పటివరకు ఆ రికార్డును బద్దలు కొట్టలేదు .నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రధానులు బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్నారు.

1869లో ఇండియాలో తొలి బడ్జెట్
1869లో ఇండియాలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆనాడు జేమ్స్ విల్సన్ బడ్జెట్ ను రూపొందించారు. భారత్ ను బ్రిటిష్ వారు పాలించే కాలం నుండి బడ్జెట్ ను సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టేవారు. 2001లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా కొద్ది మార్పులతో ఉదయం 11 గంటలకు మార్చారు.బడ్జెట్ ను ప్రవేశ పెట్టడాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు జరిపింది. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ ను ప్రవేశపెట్టేవారు. కానీ 2018 లో మాత్రం ఫిబ్రవరి 1వ , తేదినే బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అయితే జనవరి నుండి డిసెంబర్ వరకు బడ్జెట్ ను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రానున్న రోజుల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రాలు కూడ అదే రీతిలో బడ్జెట్ ను రూపొందించే అవకాశాలు లేకపోలేదు.

బడ్జెట్ లీకైతే పదవులు కోల్పోతారు
యూకే బడ్జెట్ రూపొందించే వ్యక్తిని బ్రిటిష్ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ అంటారు. 1947లో ఆ స్థాయిలో ఉన్న డాల్టన్ పన్ను వ్యవస్థలో చేయబోయే మార్పుల గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బడ్జెట్ వివరాలను చెప్పారు.. డాల్టన్ పార్లమెంటులో ఉపన్యానం ఇవ్వడానికంటే ముందే ఆ వివరాలను బయటపెట్టాడా విలేకరి. దాంతో డాల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటినుంచి బడ్జెట్ రూపకల్పనను చాలా రహస్యంగా నిర్వహిస్తున్నారు. అదే సంప్రదాయం కొనసాగుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం ముందు నుంచి దాని తయారీలో పాల్గొనే సిబ్బందికి బయటివారితో ఎటువంటి సంబంధాలు ఉండవు. ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ను పార్లమెంటులోకి తీసుకువచ్చే వరకు వారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తారు.

10 సార్లు బడ్జెట్ పెట్టిన మొరార్జీ దేశాయ్
కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీదేశాయ్ పది దపాలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి 29. అయితే ఆ రోజుల్లో ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టేవారు. దీంతో 1964, 1968 సంవత్సరాల్లో మాత్రమే మొరార్జీ దేశాయ్ బడ్జెట్ ను తన పుట్టిన రోజున ప్రవేశపెట్టారు.

ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టని మంత్రి
కె.సి.నియోగి ఆర్థిక మంత్రిగా ఉండి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు. కేవలం 35 రోజులే ఆయన ఆ పదవిలో ఉండటంతో ఆయనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు.












Click it and Unblock the Notifications