తండ్రి బెల్ట్‌తో కొట్టేవాడు: డ్రైవర్‌తో ఇంద్రాణి పరారీ
ముంబై: తన కూతురు షీనా బొరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖార్జియా బాల్యం చాలా బాధాకరంగా గడిచినట్లు తెలుస్తోంది. మద్యం సేవించి వచ్చి తండ్రి ఆమెను చిన్నప్పుడు బెల్ట్‌తో విపరీతంగా కొట్టేవాడని అంటున్నారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఆమె పాఠశాలలో ఉన్నప్పుడు ఫ్యామిలీ డ్రైవర్‌తో పారిపోయింది. అయితే, ఆమెను పట్టుకుని తిరిగి ఇంటికి తెచ్చారు. బాల్యంలో ఇంద్రాణికి ప్రేమ కరువైందని ఆమె బంధువు ఒకరు చెప్పారు. ఆమె ఆలనాపాలనను కూడా పట్టించుకునే వారు కాదని చెప్పారు.

ఇంద్రాణి తండ్రి ఉపేంద్ర కుమార్ బొరా, ఆయన భార్య దుర్గా రాణి నిత్యం గొడవ పడుతూ ఉండేవారని కూడా ఆ బంధువు చెప్పారు. ఇంద్రాణిని ఇంట్లో పెట్టి, తాళం వేసి వారిద్దరు వెళ్లిపోయేవారని, గంటల తరబడి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వారు మళ్లీ గొడవ పడేవారని అంటున్నారు.
భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో తీవ్ర నిస్పృహకు లోనై తండ్రి ఇంద్రాణిని కొట్టేవాడని అంటున్నారు. ఇంద్రాణి తండ్రి తనను కొట్టే విషయంపై ఇరుగుపొరుగువారికి చెబుతుండేదని సమాచారం. తల్లిదండ్రులు షీలాంగ్‌కు పంపించిన తర్వాత స్వేచ్ఛ లభించినట్లు ఇంద్రాణి తొలిసారి ఫీలై ఉంటుందని అంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications