కోమాలోనే ఇంద్రాణి: విష ప్రయోగం జరిగిందనే అనుమానం?

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందుతురాలైన ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తాము ఇస్తున్న ట్రీట్‌మెంట్‌కు ఆమె స్పందిస్తున్నారని జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే ఆదివారం వెల్లడించారు.

ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆమెను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై లేదని, తనంతట తాను ఊపిరి తీసుకోలేకపోవడం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు.

ఆమె బీపీ నార్మల్ గానే ఉందని తెలిపారు. ఆమె ఎప్పుడు కోమా నుంచి బయటకు వస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, ఆమె ప్రాణాలకు అపాయం తప్పిందని కూడా అనలేమని వివరించారు. మరోవైపు జైల్లో ఇంద్రాణి వద్దకు మోతాదుకు మించి మాత్రలు ఎలా చేరాయనే దానిపై జైళ్ల శాఖ ఐజీ దర్యాప్తు ప్రారంభించింది.

Indrani Mukerjea Remains Critical, Still Unconscious: Doctors

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంద్రాణిని కలిసేందుకు అనుమతించాలంటూ ఆమె తరఫు న్యాయవాది స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆర్థర్ రోడ్‌ జైలులో ఉన్న ఇంద్రాణి భారీ మోతాదులో ట్యాబ్లెట్లు మింగడంతో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆమెను హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

శుక్రవారం ఉదయం నుంచి జేజే ఆస్పత్రిలో ఇంద్రాణికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. ఇంద్రాణి మత్తుమందులు అధికంగా వాడినట్లు వైద్యులు తెలిపారు. సొంత కుమార్తెను హత్య చేసిన ఆరోపణలపై కేసును ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియాపై విషప్రయోగం జరిగిందా?

ఈ దిశగా విచారణ జరపాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు. డిప్రెషన్‌ను అధిగమించడానికి వాడే గుళికలను ఆమె ఎక్కువ మోతాదులో తీసుకుందని వైద్యులు అంటున్నారు. జైలు అధికారులను ఇచ్చిన గుళికలను ఆమె నిలువ చేసుకుని మింగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+