వాటి రేట్లు భారీగా పెరిగాయ్ : మోత ఇవ్వాళ్టి నుంచే..!!

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల్లో యధాతథ స్థితి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగట్లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదశలో క్రూడాయిల్ ధర సైతం భారీగా పెరిగినా.. దాని ప్రభావం దేశీయ ఇంధన విక్రయాలపై పడలేదు. ఇది సామాన్యులకు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) రేట్లను పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు మరోసారి ధరల మోత మోగించింది.

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ రేటును పెంచింది. పెరిగిన ధరలు- ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, దానికి ఆనుకుని ఉండే ప్రాంతాలకు సరఫరా చేసే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను సవరించినట్లు ప్రకటించిందా కంపెనీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధంగా పని చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. కిలో సీఎన్జీపై మూడు రూపాయలను పెంచినట్లు ప్రకటించింది.

Indraprastha Gas Limited has hiked CNG and PNG prices these cities with effect from today

దీనితో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.78.61 పైసలకు చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లల్లో రూ.81.17 పైసలు పలుకుతోంది. గుర్‌గావ్‌లో దీని రేటు మరింత అధికంగా ఉంది. కేజీ సీఎన్జీ 86.94 పైసలకు చేరింది. రెవారి-రూ.89.07 పైసలు, కర్నాల్, కైథల్-రూ.87.27 పైసలుగా ఉంది. కాన్పూర్, హమీర్‌పూర్, ఫతేపూర్‌లల్లో రూ.90.40 పైసలు, అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లల్లో రూ.88.88 పైసలుగా రికార్డయింది.

పైప్డ్ నేచురల్ గ్యాస్ ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో పీఎన్జీ ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌ రూ. 53.59 పైసలకు పెరిగింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో ధరలు రూ. 53.46, ముజఫర్‌నగర్, షామ్లీ మీరట్‌లలో రూ.56.97 చేరుకున్నాయి. రాజస్థాన్‌లోని అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లలో రూ.59.23గా నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, ఫతేపూర్, హమీర్‌పూర్‌లలో ఈ ధరలు స్వల్పంగా తగ్గింది.

Indraprastha Gas Limited has hiked CNG and PNG prices these cities with effect from today

నేచురల్ గ్యాస్ ఉత్పత్తి రేటును కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారీగా పెంచింది. ఒక్కో యూనిట్ మీద రూ. 8.57 పైసలను అదనంగా చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌ మేర నేచురల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి ఇదివరకు కేంద్రం రూ. 6.10 పైసలను చెల్లించేది. దీన్ని రూ.8.57 పైసలకు పెంచింది. ఉత్పాదక రేటును పెంచాల్సి రావడం వల్ల పడిన భారాన్ని కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల నుంచి వసూలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+