ట్విట్టర్‌లో రచ్చ: ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా కేంద్ర మంత్రి భార్య
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా డాక్టర్ పునీత సిన్హాను నియమించినట్లు ఇన్ఫోసిస్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. డాక్టర్ పునీత సిన్హా ఎవరో కాదు దేశ నడిపిస్తోన్న ప్రధాని మోడీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా భార్య.
53 ఏళ్ల పునీత సిన్హా అమెరికాలోని ప్రఖ్యాక కంపెనీలతో పని చేశారు. అంతేకాదు అంతర్జాతీయ, ఎమర్జెంగ్ మార్కెట్లలో ఫండ్ మేనేజ్‌మెంట్ అంశంలో ఆమెకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ కంపెనీలైన ఎస్‌కేఎస్ మైక్రో ఫైనాన్స్, శోభా లిమిటెడ్‌లలో బోర్డు మెంబర్‌గా పని చేశారు.
కాగా పునీత సిన్హాను ఇన్ఫోసిస్ ఇండిపెండెండ్ డైరెక్టర్‌గా నియమించినట్లు ప్రకటన వెలువడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశారు. ఓ కేంద్ర మంత్రి భార్యను నియమించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం ఆమెకు మద్దతిస్తున్నారు.
#Infosys Independent Director with Minister of State, Finance ..
Now go audit #Infosys Balance Sheets
#Nepotism pic.twitter.com/AMvQ8L3ktN
— Shuvankar Mukherjee (@shuvankr) January 14, 2016 Remember the fuss when Nalini Chidambaram appeared as senior counsel for IT department when PC was FM? https://t.co/cyRh08uojj
— SANJAY HEGDE (@sanjayuvacha) January 14, 2016 @shuvankr @sanjayuvacha Punita Kumari Sinha may be the MOS Finance's wife but she does have an independent standing in the corporate world
— Sumeet Rewari (@sumsrewari) January 14, 2016 వాట్సన్ స్కూలు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఆమె ఫైనాన్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - న్యూఢిల్లీ నుంచి ఆమె కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పట్టాను పొందారు. ఇక్కడే పునీత సిన్హా, జయంత్ సిన్హా ఇద్దరూ ఒకరిపై మరొకరు ఇష్టపడ్డారు. అంతేకాదు బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హాకు ఈమె కొడలు.












Click it and Unblock the Notifications