ఇన్ఫోసిస్: కొత్త సీఈఓ ఎంపిక నేడే! నందన్ నిలేకని ఎవరివైపు మొగ్గుతారో?

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ సీఈఓ ఎంపిక బాధ్యతలను సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని భుజాన వేసుకున్న సంగతి తెలి

న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ సీఈఓ ఎంపిక బాధ్యతలను సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం సీఈఓ పదవికి తాను ఎంపిక చేసిన వ్యక్తి పేరును ఆయన వెల్లడించనున్నారు.

ఈ పోస్టుకు మాజీ ఎగ్జిక్యూటివ్ లు బీజీ శ్రీనివాస్, వేమూరి అశోక్ లు గట్టి పోటీని ఇస్తున్నట్లు, వీరిద్దరిలో ఒకరికి తదుపరి ఇన్ఫీ బాధ్యతలు దక్కుతాయని తెలుస్తోంది. 2014లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సీఈఓగా విశాల్ సిక్కాను ఎంపిక చేయకముందే వీరిద్దరూ ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసి వెళ్లిపోయారు.

Infosys likely to name next CEO today, Who is the Neelekani's Choice?

ఇన్ఫోసిస్ అభివృద్ధిలో బీజీ శ్రీనివాస్, వేమూరి అశోక్ లకు భాగముంది. ప్రస్తుతం శ్రీనివాస్ పీసీసీడబ్ల్యూ గ్రూప్ ఆఫ్ హాంకాంగ్ ఎండీగా ఉన్నారు. ఇన్ఫోసిస్ లో గ్లోబల్ మార్కెట్స్ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. శ్రీనివాస్ కే ఇన్ఫీ సీఈఓగా అధిక అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

అయితే నేటి సాయంత్రంలోగా నందన్ నిలేకని తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. ఇక ఇన్ఫీకి కొత్త చీఫ్ రానున్నారన్న వార్తలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. ఈ ఉదయం 10.40 గంటల సమయంలో ఇన్ఫీ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 0.32 శాతం పెరిగి రూ. 942 వద్ద కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+