లేడీ టెక్కీ హత్య, ఇన్ఫోసిస్ కారణం, సీనియర్ల వేధింపులు, తండ్రి రాజు
పూణే: ఇన్ఫోసిస్ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు రసిలా రాజు (24)హత్యకు ఆ సంస్థ పూర్తి బాధ్యత వహించాలని ఆమె త్రండి రాజు (55) డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా దర్యాప్తు చేస్తే రసిలా హత్యకు కచ్చితమైన కారణాలు వెలుగు చూస్తాయని అన్నారు.
రసిలా హత్యకు పూర్తి బాధ్యత ఇన్ఫోసిస్ సంస్థదే అని ఆమె తండ్రి రాజు చెప్పారు. పోలీసులు చెబుతున్నట్లు రసిలా హత్యకు సెక్యూరిటీగార్డు కారణం కాదని ఆయన అంటున్నారు. రసిలాను ఆమె సీనియర్లు వేధింపులకు గురి చేశారని రాజు ఆరోపిస్తున్నారు.
పూణేలో ఆయన పూణే మిర్రర్ ఆంగ్ల దినప్రతికతో మాట్లాడుతూ తన కుమార్తె చాల రోజు నుంచి బెంగళూరు బదిలి చెయ్యాలని ఇన్ఫోసిస్ కంపెనీలోని ఆమె సీనియర్లకు మనవి చేశారని గుర్తు చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం తన బదిలి నిలిచిపోయిందని రసిలా తనకు ఫోన్ లో చెప్పిందని రాజు విలపించారు.

ఇన్ఫోసిస్ సంస్థలో తన కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని సంతోషంగా ఉన్నానని, అయితే ఇప్పుడు ఆ సంస్థ ఆమె జీవితం అంతం కావడానికి కారణం అయ్యిందని ఊహించుకోలేకపోతున్నానని రాజు విలపించారు.
సెక్యూరిటీగార్డు వేధించి రసిలాను హత్య చేశారని చెబుతున్నారని, అయితే తన కుమార్తె హత్యకు ఇన్ఫోసిస్ సంస్థ కారణం అని తాను భావిస్తున్నానని రాజు అన్నారు. రసిలా ఇప్పటికే తల్లిని పోగోట్టుకుందని, తన కుమారుడు అబుధాబిలో ఉన్నాడని, ఇప్పుడు కుమార్తె మరణించడంతో తాను ఒంటరివాడైయ్యానని రాజు విలపించారు.
ఒక సెక్యూరిటీ గార్డు ఎలా రసిలా పని చేస్తున్న చోటకు వెలుతాడని, అక్కడి ఉద్యోగుల సహకరించకపోతే అది ఎలా సాధ్యం అవుతుందని రాజు ప్రశ్నించారు. మాజీ సైనికుడు అయిన నేను ప్రస్తుతం కేరళలో హోం గార్డుగా పని చేస్తున్నానని రాజు చెప్పారు.
తాన కుమార్తె రసిలా హత్య కేసులో చివరి వరకు ఇన్ఫోసిస్ సంస్థ మీద న్యాయ పోరాటం చేస్తానని రాజు స్పష్టం చేశారు. వైద్య చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు బదిలి చెయ్యాలని మెడికల్ సర్టిఫిక్ పెట్టుకున్నా రసిలా విషయంలో సీనియర్లు కనికరించలేదని రాజు ఆరోపించారు. రసిలా మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications