బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ అధినేత, వరద బాధితుల కోసం ఇలా, అమ్మా సెల్యూట్, వైరల్ వీడియో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నామా అనే విషయం ముఖ్యం కాదు. అందులో ఇతరులకు ఎంత సహాయం చేస్తున్నామా ? అనే విషయం ముఖ్యం. ప్రపంచంలోనే ఎంతో గొప్ప పేరు ఉన్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ఉన్నతమైన పదవిలో ఉంటూ ఆపదలో ఉన్న వారికి స్వయంగా సహాయం చెయ్యడానికి ఆమె సిద్దం అయ్యారు. వేల మంది పనివారు ఉన్నా స్వయంగా తానే పనులు చెయ్యడానికి సిద్దం అయ్యి అనేక మందికి ఆమె ఆదర్శంగా నిలిచారు.

కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు ఆ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. వేలాధి ఇండ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది స్థానికులు సహాయక శిభిరాలలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి అనేక మంది ముందుకువస్తున్నారు.

Infosys Sudha Murthy is preparing to help victims of Kodagu floods

ప్రముఖ ప్రసిద్ది చెందిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి ఇన్ఫోసిన్ పౌండేషన్ నేతృత్వంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. డబ్బు ఉంది కదా, పనివాళ్లు చూసుకుంటారులే అని చాల మంది అనుకుంటారు. అయితే ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి మాత్రం అలా చెయ్యడం లేదు.

ఒక సాధారణ మహిళలాగా వరద బాధితులకు సహాయం చెయ్యడానికి సిద్దం చేసిన సామాగ్రి, దుస్తులను స్వయంగా సుధామూర్తి దగ్గర ఉండి అన్నీ ప్యాక్ చేయించారు. సాటి పనివారితో కలిసి సుధామూర్తి కూడా దస్తులు, వస్తువులు ప్యాకెట్లలో సిద్దం చేశారు.

పని వారితో కలిసి ఇన్ఫోసిస్ సుధామూర్తి వరద బాధితుల సహాయం కోసం దుస్తులు ప్యాక్ చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సామాన్యులు కట్టుకునే చీర కట్టుకున్న సుధామూర్తి పని చేస్తున్న వీడియో చూసిన అనేక మంది అమ్మా మీకు సెల్యూట్. మీలాంటి వారు మాకు ఆదర్శం అంటూ సుధామూర్తిని అభినందిస్తున్నారు.

English summary
Viral video: Infosys chairperson and Kannada writer Sudha Murthy is preparing to help victims of Kodagu floods through her Infosys foundation. Here is a viral video of her simplicity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X