చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై స్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా టెక్కీ హత్యలో ట్విస్ట్‌లు ఎన్నో!

|
Google Oneindia TeluguNews

చెన్నై: సుంగంబాకం రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని రెండు రోజుల క్రితం హత్య చేశారు. ఈ హత్య కేసును చేధించేందుకు రైల్వే పోలీసులు ఇద్దరు డిఎస్పీలు, ఐదుకురు ఇన్స్‌పెక్టర్లతో కూడిన ప్రత్యేక టీంను నియమించారు.

చెన్నై రైల్వే‌స్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని నరికి చంపింది ఇతడే (ఫోటో)చెన్నై రైల్వే‌స్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని నరికి చంపింది ఇతడే (ఫోటో)

సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నామని, ప్రత్యేక టీం పని చేస్తోందని, దర్యాఫ్తు వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని పోలీసులు చెప్పారు.

ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని శనివారం నాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైల్వే అధికారులకు సూచించారు. తమ నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

హత్య రోజున స్వాతిని ఆమె తండ్రి ఉదయం గ.6.40 నిమిషాలకు రైల్వే స్టేషన్‌లో దింపి వెళ్లారు. ఆ తర్వాత ఆరు నిమిషాల్లోనే అంటే గం.6.46 నిమిషాలకు ఆమె హత్య చోటు చేసుకుంది. కాగా, రైల్వే స్టేషన్లో ఆమెతో యువకుడు మాట్లాడాడని, ఆ తర్వాత మారణాయుధం తీసుకొని చంపేసినట్లుగా ఉందని తెలుస్తోంది. అప్పుడు వారు పీసీవో బూత్ వద్ద ఉన్నారు.

హత్య తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఓ దుకాణదారు చూసినప్పటికీ, అతనిని గుర్తించలేదని తెలుస్తోంది. తాము యువతి అరుపులు విన్నామని, చాలామంది గుమికూడారని, తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిందని అతను చెప్పాడు.

మేం అక్కడకు పరుగెత్తేసరికి ఆమె చనిపోయ ఉందని, పోలీసులకు సమాచారం అందించామని ఓ దుకాణదారు చెప్పాడు. పోలీసులు అక్కడకు వెంటనే వచ్చారని, ఆ తర్వాత మూడు గంటలకు టెక్కీ తండ్రి, కుటుంబ సభ్యులు వచ్చారన్నారు. ప్రాథమిక విచారణలో.. బాధిత టెక్కీ, హత్య చేసిన దుండగుడి మధ్య చర్చ జరిగినట్లుగా తేలిందని సమాచారం. మరోవైపు ఇది లవ్ జిహాదీ హత్య కూడా కావొచ్చునని కొందరు అంటున్నారు. అయితే, విచారణలో అన్నీ తేలనున్నాయి.

స్వాతి హత్య

స్వాతి హత్య

నుంగంబాకం రైల్వే స్టేష‌న్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని న‌రికి చంపిన నిందితుడి ఊహా చిత్రాన్ని చెన్నై పోలీసులు శనివారం రిలీజ్ చేశారు.

స్వాతి హత్య

స్వాతి హత్య

రైల్వే స్టేష‌న్ సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన అత‌డి ఊహా చిత్రం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని దారుణ హత్య నిందితుడుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

స్వాతి హత్య

స్వాతి హత్య

నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు. హతురాలు స్వాతి(25)గా పోలీసులు గుర్తించారు.

 స్వాతి హత్య

స్వాతి హత్య

ఇన్ఫోసిస్‌ కంపెనీలో పనిచేస్తున్న స్వాతి సూలైమేడు ప్రాంతంలోని దక్షిణ గంగై వీధిలో నివసించేది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 6.20 ప్రాంతంలో ఆమె తండ్రి నుంగంబాకమ్‌ స్టేషన్‌‌ వద్ద దించి వెళ్లాడు.

 స్వాతి హత్య

స్వాతి హత్య

దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు నుంగంబాకమ్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో నల్ల ప్యాంటు వేసుకున్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, ఓ కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. అయితే ముందు ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుందని, ఆ తర్వాత అతడు బ్యాగ్‌లోంచి కత్తిని బయటకు తీసి దాంతో ఆమెను పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్వాతి హత్య

స్వాతి హత్య

స్వాతికి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గత వారం ఆమెకు ఓ క్యాబ్ డ్రైవర్ తో గొడవ అవ్వడంతో, అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A day after the brutal murder of a 24 year old techie at Nungambakkam railway station, the railway police seems to have made no headway into its investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X