బెంగళూర్‌లో మరో ఎటిఎం దాడి: ఒకరి అరెస్టు
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఎటిఎం దోపిడీకి ప్రయత్నం జరిగింది. సెక్యూరిటీ గార్డు తెలివిగా వ్యవహరించి, దుండగుల ప్రయత్నాన్ని విఫలం చేశాడు. అదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బెంగళూర్‌లోని మడివాలలోని హోంగసంద్రా ప్రధాన రహదారిపై ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఎటిఎం కేంద్రంలోకి ప్రవేశించి, సెక్యూరిటీ గార్డు షాబుద్దీన్ (35)ను కట్టిపడేసి దోపిడీకి ప్రయత్నించారు.
రోటీ, దాల్ తిన్న తర్వాత కుర్చీలో షాబుద్దీన్ జోగాడు. పెద్ద శబ్దం రావడంతో లేచాడు. ఇద్దరు వ్యక్తులు ఎటిఎం కేంద్రంలోకి ప్రవేశించారు. ఒక వ్యక్తి ముఖం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకోగా, మరో వ్యక్తి దుస్తులతో ముఖం కనిపించకుండా కట్టుకున్నాడు.

ఓ వ్యక్తి సర్రున దూసుకొచ్చి పదునైన ఆయుధంతో షాబుద్దీన్ తలపై మోదాడు. కుర్చీకి కట్టేశాడు. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి బయట నించున్నాడు. లోనికి వచ్చిన వ్యక్తి ఎటిఎం డిస్‌ప్లె్ స్క్రీన్‌ను విరగ్గొట్టాడు.
రక్తమోడుతూ గ్లాస్ డోర్ పక్కనే కూర్చున్న షాబుద్దీన్ బయటి దృశ్యం కనిపిస్తోంది. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు కనిపించారు పోలీసులు బైక్‌పై వస్తుండగా బయట ఉన్న వ్యక్తి లోని వ్యక్తిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే తాను తన చేతులను విప్పదీసుకుని కింద పడి ఉన్న ఆయుధంతో దాడి చేశానని షాబుద్దీన్ చెప్పాడు.
పోలీసులు సమీపించగానే సాయం కోసం షాబుద్దీన్ గట్టగా అరిచాడు. బయట ఉన్న వ్యక్తి పారిపోగా, గార్డు సహాయంతో పోలీసులు రెండో వ్యక్తిని పట్టుకున్నారు. అతన్ని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సందీప్‌గా పోలీసులు గుర్తించారు. ఆ దృశ్యమంతా ఎటిఎం సిసి కెమెరాలో రికార్డయింది.












Click it and Unblock the Notifications