కేజ్రీపార్టీ నేత ముఖంపై ఇంక్ దాడి, ఇవి తప్పవని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత యోగేంద్ర యాదవ్ ముఖం పైన ఓ వ్యక్తి సిరా చల్లాడు. శనివారం ఎఎపి నిర్వహించిన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన యోగేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి ఓ గుర్తు తెలియన వ్యక్తి వచ్చి యాదవ్ ముఖంపై ఒక్కసారిగా సిరా పోశాడు.
ఆ తర్వాత వెంటనే భారత్ మాతాకీ జై అంటూ నినదించాడు. ఈ ఘటనతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పరిస్థితి మరింత అదుపు తప్పకముందే పోలీసులు జోక్యం చేసుకుని, అతన్ని అక్కడి నుంచి తరలించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఎఎపి టోపీ, బ్యాడ్జీ ధరించిన ఆ యువకుడు ముఖంపై సిరా పోశాడు. అతడిని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు పోలీసులు తరలించారు. షాలిమార్ బాగ్‌కు చెందిన సాగర్‌గా గుర్తించారు.

కాగా, హర్యానాలోని గుర్గావ్ నుంచి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎఎపి తరఫున యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. మీతో మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి వచ్చి ఆ వ్యక్తి నా ముఖంపై సిరా పోశాడని, తాను అతన్ని చూడలేదని, ఈ దేశంలో శక్తివంతులపై పోరాడుతున్నప్పుడు దానికి కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, వ్యాఖ్యానించారు. ఏమైనప్పటికీ తనపై దాడి చేసిన ఆ వ్యక్తిని భగవంతుడు క్షమించాలని కోరుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications