కన్హయ్య కుమార్‌పై ఇంక్ దాడి.. యాసిడ్ అంటోన్న కాంగ్రెస్.. కలకలం..

నేతలపై ఇంక్ దాడి సహజమే.. అవును ఇటీవల అదీ ఫ్యాషన్ అయిపోతుంది. ప్రెస్ మీట్, సభకు వచ్చే సమయంలో.. వెళ్లే సమయంలో తప్పడం లేదు. అయితే ఇంక్ చోటులో యాసిడ్ అయితే కాస్త ఆందోళన కలిగించే అంశమే.. అవును యూపీలో అలాంటి దాడి జరిగింది. కానీ ఇంక్ దాడే జరిగిందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం లక్నోకు నేతలు వస్తున్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి, కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్‌ లక్నో చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కూడా.. అతనిపై ఇంక్ దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. కన్నయ్య కుమార్‌పై జరిగింది ఇంక్ దాడి కాదని, యాసిడ్ దాడి అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కన్నయ్య కుమార్‌పై ఇంక్ చల్లేందుకు నిందితుడు ప్రయత్నించగా, ఆయనకు సమీపంలో ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తులపై అది పడింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు అతడిని పట్టుకున్నారు. అతడికి సంబంధించిన వివరాలను మాత్రం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.

Ink thrown at Kanhaiya Kumar at Congress office in Lucknow

లక్నోలో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా 'డోర్ టు డోర్' ప్రచారం కోసం కన్నయ్య కుమార్ లక్నో చేరుకున్నారు. కన్నయ్య కుమార్ మాట్లాడుతూ.. హత్రాస్, ఉన్నావో, లఖింపూర్ ఖేరీ వంటి ఘటనల్లో న్యాయ కోసం కాంగ్రెస్ వీధుల్లోకి వచ్చి పోరాడిందన్నారు. దేశ నిర్మాణం చేతకాని వారు దేశాన్ని అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ నిర్మించిందన్నారు. అలాంటి వారి నుంచి కాంగ్రెస్ ఈ దేశాన్ని రక్షిస్తోందని చెప్పుకొచ్చారు.

గ్వాలియర్‌లో 2018లో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, కన్నయ్య కుమార్‌పై ఓ వ్యక్తి ఇంక్ చల్లాడు. ఓ సెమినార్‌లో పాల్గొనేందుకు వచ్చిన వీరిపై హిందూ సేనకు చెందిన ముకేశ్ పాల్ అనే వ్యక్తి వీరిపై ఇంక్ చల్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+