వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్.ఐటిశాఖ సోదాల్లో మూడువేల కోట్లు స్వాధీనం

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఆదాయపు పన్నుశాఖ అధికారులు దేశ వ్యాప్తంగా 586 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు మూడువేల కోట్ల రూపాయాలను అధికారులు పట్టుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్నుశాఖాధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు మూడు వేల కోట్లను పట్టుకొన్నారు. వీటిలో 76వేల కోట్లు కొత్త కరెన్సీ కాగా, మిగిలిన రెండువేల ఆరువందల కోట్లకు ఆధారాలు చూపలేదు.

పెద్ద నగదు నోట్ల రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్నుశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. దేశంలోని సుమారు 586 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మూడువేల కోట్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఆదాయపు పన్నుశాఖ అధికారులు తెలిపారు.

దేశంలోని తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో ఈ నగదును స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏకకాలంలో ఐటి శాఖ అధికారులు చెన్నైలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో వందకోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకొన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో సుమారు 140 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ నగదుతో పాటుగా 52 కోట్ల బంగారాన్ని కూడ అధికారులు స్వాథీనం చేసుకొన్నారు. అక్రమార్కుల భరతం పట్టేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 inome tax department has carried 586 raids across the country

తనిఖీలు ఏందుకు చేశారు

పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత నల్లధనం మార్పిడి కోసం అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలను చేపట్టింది. ఈ తనిఖీల ఆధారంగా నల్ల ధనం మార్పిడి కోసం అక్రమార్కులు చేపట్టిన చర్యలను అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఆదాయపు పన్నుశాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

ఆధారాలు చూపని నగదు

ఢిల్లీలోని ఓ న్యాయవాది ఇంటి ప్రాంగణంలో తాజాగా నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు ఐటి అధికారులు. గత అక్టోబర్ మాసంలో ఆ లాయర్ 125 కోట్లను తన లెక్కలో చూపలేదు. రెండు వారాల క్రితం అతని అకౌంట్లను అధికారులుసీజ్ చేశారు. లెక్కల్లో చూపని సుమారు 19 కోట్లను సీజ్ చేశారు.
ఐటి అధికారుల దాడులతో పుణెలోని బ్యాంకు ఆఫ్ మహారష్ట్రలోని ఒక వ్యక్తికి చెందిన 15 లాకర్ల వివరాలను వెల్లడించింది. ఈ లాకర్లలో 9.85 కోట్ల నగదు ఉంది.వీటిలో కొత్త రెండు వేల రూపాయాలున్న కరెన్సీ సుమారు 8 కోట్ల రూపాయాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

గత మాసంలో బ్యాంకు రికార్డులు, సిసి టివి రికార్డులు పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పెద్ద పెద్ద బ్యాగులుతో బయటకు వెళ్ళడం, లోపలికి రావడం రికార్డు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. పుణేలో ఐటి శాఱ అధిరారులు నిర్వహించిన దాడుల్లో సుమారు 10.80 కోట్ల నగదు పట్టుబడింది. వీటిలో కొత్త కరెన్సీ నోట్లు సుమారు 8.8 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

English summary
after the announcement of demonetasation the income tax department carried out a record 586 searches across the country which yielded more than three hundred crores seizrs, 79 crore in new currency notes fo two thousand,and unacconted income of 2,600 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X