వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు టీ అమ్మిన వ్యక్తి నేడు మనల్ని శాసిస్తారా ?, నాటకం, ప్రధాని మోదీకి అవమానం, దేశద్రోహం కేసు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారని, సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చారని ఆరోపిస్తూ కర్ణాటకలోని బీదర్ లోని విద్యాసంస్థ మీద కేసు నమోదైయ్యింది. ఆ నాడు టీ అమ్ముకున్న వ్యక్తి నేడు మనల్ని అనేక విలువైన పత్రాలు చూపించాలని ఆదేశాలు జారీ చేసే స్థాయికి ఎదిగారని నాటకంలో ఎగతాలిగా ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటకంలో ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారని ఆరోపిస్తు ఆ విద్యాసంస్థ నిర్వహకుల మీద దేశద్రోహం కేసు నమోదైయ్యింది.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

ప్రముఖ విద్యాసంస్థ

ప్రముఖ విద్యాసంస్థ

కర్ణాటకలోని బీదర్ లో శాహిన్ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. శాహిన్ శిక్షణ సంస్థలో సీఏఏ, ఎన్ఆర్ సీ జారీ చెయ్యడం వలన ప్రజలకు అనేక సమస్యలు ఎదురౌతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఓ నాటకం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సీఏఏ, ఎన్ఆర్ సీ కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని విద్యాసంస్థ నిర్వహకులు తెలిపారు.

టీ అమ్మిన ప్రధాని మోదీ

టీ అమ్మిన ప్రధాని మోదీ

విద్యార్థులు ప్రదర్శించిన నాటకంలో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ క్యారెక్టర్ వేశారు. గతంలో టీ అమ్ముకున్న వ్యక్తి నేడు ప్రజల మీద బలవంతంగా సీఏఏ, ఎన్ఆర్ సీ బిల్లులు రుద్దారని, నేడు ఆయన మిమ్మల్ని విలువైన దృవీకరణ పత్రాలు చూపించాలని ఆదేశాలు జారీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే విధంగా నాటకం ప్రదర్శించారు.

వీడియో వైరల్

వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ గతంలో టీ అమ్ముకున్నారని, నేడు ప్రజల మీద పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ ప్రదర్శించిన నాటకం వేసిన సమయంలో స్థానిక ప్రజలు, టీచర్లు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దేశద్రోహం కేసు

దేశద్రోహం కేసు

ప్రధాని నరేంద్ర మోదీ గతంలో టీ అమ్ముకున్నారని, నేడు సీఏఏ, ఎన్ఆర్ సీ బిల్లులు ప్రవేశపెట్టారని, ఆయనను కించపరిచే విధంగా నాటకం వేసి దానిని సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ విద్యాసంస్థ మీద కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త నీలేష్ ఫిర్యాదు మేరకు విద్యాసంస్థల నిర్వహకుడు డాక్టర్ అబ్దుల్ ఖదీర్ మీద దేశద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బీదర్ న్యూ టౌన్ పోలీసు అధికారులు తెలిపారు.

బీజేపీ మంత్రి సీరియస్

బీజేపీ మంత్రి సీరియస్

ఈ విషయంపై బీదర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రభు చౌహాన్ సైతం సీరియస్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే విధంగా నాటకం ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చిన విద్యాసంస్థల నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీదర్ జిల్లా ఎస్పీ, బీదర్ న్యూటౌన్ పోలీసు అధికారులకు సూచించారు.

English summary
Karnataka: Bidar new town police registered case against education institute in Bidar for insert prime minster Narendra Modi in drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X