వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎస్‌లోనే మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడి: ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒరిస్సాలోని పూరి జిల్లాలో చోటు చేసుకుంది. పూరి జిల్లాలోని కాకత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఇన్‌స్పెక్టర్‌పై వారం క్రితం లైంగిక దాడి అభియోగాలు నమోదయ్యాయి.

నిందితుడు శ్రీకాంత్ బారిక్(35)ను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడ్ని జుడిషియల్ కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. శనివారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Inspector held for molesting female cop in Puri

జనవరి 6న లైంగిక దాడి విషయాన్ని బాధితురాలు జిల్లా ఎస్పీ అశీష్ కుమార్ సింగ్ దృష్టికి కూడా ఆమె తీసుకెళ్లింది. దీంతో నిందిత ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ కేసును సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్(నాంపార) సుభాష్ చంద్ర మహంతి దర్యాప్తు చేస్తున్నారు.

మహంతి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రిపూట సెంట్రీగార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై నిందితుడు తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన చాంబర్‌కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను హెచ్చరించాడు.

కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, తాను అమాయకుడినని నిందిత అధికారి చెప్పాడు. అయితే విచారణలో మాత్రం అధికారి శ్రీకాంత్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. దీంతో అతనిపై సస్పెన్షన్ వేటుపడింది. అంతేగాక అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

English summary
Inspector-in-charge of Kakatpur police station in Puri district was on Sunday arrested on charges of molesting a female constable last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X