మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్: కార్యకర్తలే ఆ పార్టీ కొంపముంచనున్నారా..?

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్ ఈ నెల 11వ తేదీన జరగనుంది. అయితే మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బీజేపీ మాజీ ముఖ్యమంత్రి ఒకరు కాంగ్రెస్ సీనియర్ నేతతో మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ అధికారంలోకి వస్తుందంటూ మంత్రి పదవి ఖరారు చేసుకోండంటూ ఆ నేత కాంగ్రెస్ సీనియర్ నేతతో చెప్పడంతో బీజేపీ ఖంగుతింది. తాజాగా మరో సారి బీజేపీకి షాక్ వచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

కాంగ్రెస్‌కు సహకరించిన బీజేపీ క్యాడర్

కాంగ్రెస్‌కు సహకరించిన బీజేపీ క్యాడర్

మధ్యప్రదేశ్‌‌లో ఎన్నికలు ముగిశాక అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఏ ముగ్గురు గుమికూడినా చర్చించుకునే అంశం ఇదే అవుతోంది. అయితే మధ్యప్రదేశ్‌లో తాజాగా మరో వార్త షికారు చేస్తోంది. విజయం పై కాంగ్రెస్ చాలా ధీమాగా ఉందట. ఇందుకు కారణం మధ్యప్రదేశ్ బీజేపీ కార్యకర్తలేనట. ప్రతిసారి బీజేపీకి పనిచేసే ఆ పార్టీ కార్యకర్తలు ఈ సారి మాత్రం చాలా చోట్ల కాంగ్రెస్ గెలిచేందుకే సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలానే కొనసాగి ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు విపక్ష పార్టీలకు సహకరిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.

 బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పేందుకే క్యాడర్ ఈ నిర్ణయం

బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పేందుకే క్యాడర్ ఈ నిర్ణయం

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతలే కాదు, క్యాడర్‌ కూడా కాంగ్రెస్‌కు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లోని మంత్రులతో పాటు ఇతర ప్రముఖ నాయకులకు కూడా బీజేపీ క్యాడర్ సహకరించనట్లు తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి వనరులు కూడా ఈ బీజేపీ క్యాడరే సమకూర్చినట్లు సమాచారం. అయితే రాజస్థాన్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సాధారణంగా బీజేపీపై ఆగ్రహం ఉంటే కార్యకర్తలు ఇళ్లలో కూర్చుని ఓటువేసేందుకు రారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇలా కాంగ్రెస్‌కు సహకరించడమంటే గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. తమ సొంత పార్టీని ఓడించి వారికి జీవితాంతం గుణపాఠం నేర్పేందుకే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లో సేమ్ కార్డు ప్లే చేసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక

రాజస్థాన్‌లో సేమ్ కార్డు ప్లే చేసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక


2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే మధ్యప్రదేశ్‌లో వచ్చాయి. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారానికి దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ కార్యకర్తలు రాకుండానే ఆ పార్టీకి సహకరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే క్యాడర్‌ను లీడర్లు విస్మరించడంతో వారిపై ఆగ్రహంతో ఊగిపోయిన కమలం పార్టీ కార్యకర్తలు తామేంటో చూపించి తద్వారా మరోసారి పార్టీ నేతలు తమను చిన్న చూపు చూడకూడదనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌‌లో బీజేపీ కార్యకర్తలు ఎలాగైతే కాంగ్రెస్‌కు సహకరించారో అలానే రాజస్థాన్‌లో కూడా జరగాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే రాజస్థాన్‌లో పరిస్థితి కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+