భారత్ లో దాడులకు గతంలోనే కెనడా టెర్రరిస్ట్ నిజ్జర్ కుట్రలు ? బయటపెట్టిన నిఘా వర్గాలు...

కెనడాలో అనుమానాస్పద స్ధితిలో హత్యకు గురైన ఖలిస్తాన్ అనుకూల తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ వ్యవహారం ఇప్పుడు ఇరుదేశాల్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. ఈ హత్యతో భారత్-కెనడా దౌత్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. ఆ తర్వాత అమెరికా సహా కెనడా మిత్రదేశాలు భారత్ పై ఒత్తిడి కూడా పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దీటుగా స్పందిస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా గతంలో ఇదే నిజ్జార్ భారత్ లో దాడులకు ఇచ్చిన ఆదేశాలను బయటపెట్టింది. ఈ మేరకు నిఘా వర్గాలు గతంలో నిజ్జార్ భారత్ లో దాడులకు సిక్కులకు ఇచ్చిన ఆదేశాల సమాచారాన్ని వెల్లడించాయి. దీన్ని కెనడాతో భారత్ ఇప్పటికే పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజ్జార్ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

intel agencies say murdered khalistan terrorist hardeep singh nijjar ordered attacks in india?

హర్దీప్ సింగ్ నిజ్జార్ 1980ల నుండి పలు నేరాలలో పాలుపంచుకున్నాడని, చిన్నప్పటి నుండి స్థానిక గూండాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. 1996లో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడాకు పారిపోయి, అక్కడ ట్రక్కు డ్రైవర్‌గా లో ప్రొఫైల్‌ను కొనసాగించిన నిజ్జర్.. ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం పాకిస్థాన్‌కు వెళ్లినట్లు కూడా తెలిసింది. కెనడా గడ్డపై ఆశ్రయం పొందుతున్న సమయంలో పంజాబ్‌లో అనేక హత్యలు, దాడులకు అతను ఆదేశించాడని ఆ రిపోర్టులు చెప్తున్నాయి.

2014లో హర్యానాలోని సిర్సాలోని డేరా సచ్చా సౌదా హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రదాడిని అమలు చేయాలని నిజ్జర్ ప్లాన్ చేశాడని నిఘా నివేదికలు చెప్తున్నాయి. అయితే అతను భారత్‌కు చేరుకోలేకపోయాడని, పంజాబ్‌కు చెందిన శివసేన నాయకుడు మాజీ డీజీపీ మహ్మద్ ఇజార్ ఆలమ్‌ను లక్ష్యంగా చేసుకుని తన మాడ్యూల్‌ను ఆదేశించాడని నిఘా పత్రాలు వెల్లడించాయి. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి నిజ్జర్ స్ధానిక గ్యాంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలాతో కలిసి మోగాతో కలిసి పనిచేసినట్లు తేలింది.

2020లో 'యాంటీ-పాంథిక్ కార్యకలాపాలు' ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రీకొడుకులు మనోహర్ లాల్ అరోరా, జతీందర్‌బీర్ సింగ్ అరోరా జంట హత్యలను అర్ష్‌దీప్‌కి అప్పగించాడు. ఈ దాడిలో మనోహర్ లాల్‌ను అతని నివాసంలో కాల్చి చంపారు. నవంబర్ 20, 2020న బటిండా, కానీ అతని కొడుకు తప్పించుకున్నాడు. వారి హత్యకు నిజ్జర్ కెనడా నుంచి డబ్బు పంపినట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+