వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1500 ఏళ్ళ క్రితం నుండి ఇప్పటి వరకు నిత్యం మాస్కులు ధరిస్తున్న ఓ వర్గం .. ఇంట్రెస్టింగ్ కదూ !!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పనిసరిగా మారింది. అయితే ఒక మతానికి సంబంధించిన వారు దాదాపు 1500 సంవత్సరాల క్రితం నుండే మాస్క్ లను ధరిస్తున్నారు. ఇప్పటికీ వారు మాస్కులు ధరించడం వారి ఆచారంగా కొనసాగిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎందుకు వారు అప్పటినుండి ఇప్పటివరకు మాస్కులను ధరిస్తున్నారు అంటే..

అహింస ఆచరణలో భాగంగా మాస్కుల ధారణ

అహింస ఆచరణలో భాగంగా మాస్కుల ధారణ

జైన మతాన్ని అనుసరించేవారు చాలామంది అప్పటినుండి ఇప్పటివరకు మాస్క్ లను ధరిస్తున్నారు. జైన మత సిద్ధాంతాలలో ఒకటైన అహింస ఆచరణలో భాగంగా మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మ జీవులను కూడా హింసించకూడదు అన్న ఉద్దేశంతో, వాటికి హాని కలగకూడదు అన్న ఉద్దేశంతో జైనమతంలో మహా పట్టీని, అంటే మాస్క్ ను ధరించాలనే నియమం ఉందన్న అంశం ప్రస్తుత కరోనా కాలంలో ఆసక్తికరంగా మారింది.

1500 ఏళ్ల నుండి తెల్లని ముహపట్టీని ధరిస్తున్న శ్వేతాంబర జైనులు

1500 ఏళ్ల నుండి తెల్లని ముహపట్టీని ధరిస్తున్న శ్వేతాంబర జైనులు

1500 ఏళ్ల కిందటి నుండి జైనమతంలో శ్వేతాంబరులుగా పిలవబడే వారంతా తప్పనిసరిగా తెల్లని ముహపట్టీని ధరించడం కనిపిస్తుంది. ముహపట్టీ కేవలం అహింసకు మాత్రమే కాదు, శుభ్రతకు, అలాగే సంయమనంతో మాట్లాడాలనే అంశాలకు ప్రతీకగా నిలుస్తుందని జైనుల విశ్వాసం. మనం మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు ,తుమ్మినప్పుడు, చీదినప్పుడు, ఉమ్మినప్పుడు ఆ తుంపరలు పక్కవారి మీద పడకూడదు. అది వారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతేకాక సూక్ష్మజీవులు మన నోట్లోకి పొయ్యేలా చేస్తుంది . అందుకే శ్వేతాంబర జైనులు అప్పటినుండే మాస్కులు ధరించడం వారి ఆచారంగా మార్చుకున్నారు.

పదిహేను వందల ఏళ్ళ క్రితం నుండి నిత్యం మాస్కుల ధారణ వెనుక రహస్యం ఇదే

పదిహేను వందల ఏళ్ళ క్రితం నుండి నిత్యం మాస్కుల ధారణ వెనుక రహస్యం ఇదే

ఇక ఇప్పుడు కరోనా విషయంలో కూడా జరుగుతున్నదదే. కాబట్టి ప్రస్తుత కరోనా కష్టకాలంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు శుభ్రతను పాటించాలి అని చెప్తున్నాయి. ఇక ఇదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కరోనా గుర్తుచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం గుర్తించని ఎన్నో విశ్వాసాలు, ఎన్నో ఆచారాలు ఆనాడే వివిధ మతాలలో ఆచరించిన ఎందరో మహానుభావులు త్రికరణశుద్ధిగా అటు ప్రకృతిని, ఇటు మానవ జీవన విధానాన్ని బేరీజు వేసుకొని మరి రూపొందించారు అని చెప్పడం నిర్వివాదాంశం. పదిహేను వందల ఏళ్ళ క్రితం నుండి ఇప్పటివరకు శ్వేతాంబర జైనులు మాస్క్ లను వినియోగిస్తున్న తీరు అందుకు నిదర్శనం.

English summary
Many followers of Jainism have been wearing masks from past 1500 years. One of the Jain doctrines of the practice of non-violence is the fact . in the present corona period the rule of wearing a mask. A mask of Jainism, is intended to not harm even the smallest micro-organisms around us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X