పార్లమెంట్ కొత్త భవనం డిజైనర్ ఎవరంటే ?, ఫీజు ఎన్ని వందల కోట్లు ?, మోదీ మార్క్ డిజైన్ !
న్యూఢిల్లీ/అహమ్మదాబాద్: దేశం మొత్తం ఇప్పుడు దేశ రాజధానిలోని కొత్త పార్లమెంట్ భవనం వైపు చూస్తోంది. న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 27న ప్రారంభించారు. కానీ కొత్తగా నిర్మించిన నిర్మాణంలో ఇంత వరకు పార్లమెంట్ సమావేశాలు ఇంతకాలం నిర్వహించలేదు. అయితే మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
పార్లమెంట్ కొత్త భవనంలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని చూసిన వాళ్లు ఔరా అంటున్నారు. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని బిమల్ పటేల్ రూపొందించారు. బిమల్ పటేల్ ఆర్కిటెక్చర్ రంగంలో ప్రముఖుడు. ఇప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాధించారు.

కొత్త పార్లమెంట్ భవన రూపకర్త కూడా బిమల్ పటేల్ కావడం విశేషం. గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ కాశీ విశ్వనాథ్ కారిడార్ వెనుక డిజైన్ మ్యాన్ కూడా. అంతకుముందు సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును కూడా బిమల్ పటేల్ రూపొందించారు. బిమల్ పటేల్ మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రఖ్యాత ఆర్కిటెక్ట్.
బిమల్ పటేల్ అహ్మదాబాద్‌లోని సీఇపీటీ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు. బిమల్ పటేల్ హెచ్ సీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. హెసీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 1960లో బిమల్ పటేల్ తండ్రి హస్ముఖ్ సి పటేల్ స్థాపించారు.

బిమల్ పటేల్ అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్‌లో చదువుకున్నాడు. తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత బిమల్ పటేల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీని అధ్యయనం చేయడానికి సీఇపీటీకి వెళ్లారు. తరువాత బిమల్ పటేల్ 1995లో యూఎస్ లోని యూసీ బర్కిలీ నుండి పీహెచ్ డీ పొందారు.
బిమల్ పటేల్‌కు 2019లో పద్మశ్రీ అవార్డుతో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. నివేదికల ప్రకారం బిమల్ పటేల్ యొక్క సంస్థ కొత్త పార్లమెంటుతో సహా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల కోసం కన్సల్టెన్సీ సేవల కోసం రూ. 229. 75 కోట్లు అందుకుందని సమాచారం. అయితే ఈ లెక్కలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని జాతీయ మీడియా అంటోంది.












Click it and Unblock the Notifications