అంతర్జాతీయ వాణిజ్య విమానాలు జులై 31 వరకు రద్దు పొడిగింపు .. కానీ కొన్ని రూట్లకు ఓకే : డిజిసిఏ ప్రకటన
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని భారత ప్రభుత్వం జూలై 31 వరకు మరోమారు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఒక ప్రకటనలో తెలిపింది. 15 నెలల విరామం తర్వాత జూన్ 30 న షెడ్యూల్ చేయబడిన విదేశీ విమానాల నిషేధం ముగిసింది. అయితే, అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో సమర్థ అధికారం ద్వారా కేస్ టు కేస్ ప్రాతిపదికన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతించవచ్చు అని కానీ అన్ని మార్గాల్లో కాదని సర్క్యులర్ లో పేర్కొంది.
డిజిసిఎ ఆమోదించిన అంతర్జాతీయ అన్ని కార్గో ఆపరేషన్ విమానాలకు ఈ పరిమితి వర్తించదని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.కరోనావైరస్ మహమ్మారి మధ్య షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ చివరిసారిగా జూన్ 30 వరకు పొడిగించబడింది. ఇప్పుడు తాజాగా మరో మారు షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ జూలై 31 అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ డిజిసిఎ బుధవారం తెలిపింది.

మార్చి 25 న లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి రెండు నెలల విరామం తరువాత దేశంలో దేశీయ ప్రయాణీకుల విమాన సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020 మార్చి 23 నుండి షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు భారతదేశంలో నిలిపివేయబడ్డాయి. అయితే గత ఏడాది మే నుంచి ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు వందే భారత్ మిషన్ కింద, జూలై నుంచి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్ల కింద నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications