వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: 25 జీబీ డేటా ఉచితంగా ఇవ్వనున్న జియో

రిలయన్స్ జియో మరో ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. ఇంటెక్స్ 4 జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అదనంగా 25 జీబీ డేటాను అందించనున్నట్టు జియో ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ జియో మరో ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. ఇంటెక్స్ 4 జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అదనంగా 25 జీబీ డేటాను అందించనున్నట్టు జియో ప్రకటించింది.

రిలయన్స్ జియో సంచలనాలతోనే మార్కెట్లోకి దూసుకెళ్తోంది. ఉచిత ఆఫర్లతో జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. జియో దెబ్బకు ఇతర టెలికం కపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను మార్చుకొన్నారు.

రిలయన్స్ చూపిన దారిలోనే ఇతర టెలికం కంపెనీలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ కొత్తగా ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ కొత్తగా ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు టెలికం వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఇంటెక్స్ 4జీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 25 జీబీ డేటా అదనం

ఇంటెక్స్ 4జీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 25 జీబీ డేటా అదనం

ఇంటెక్స్ 4జీ స్మార్ట్ ఫోన్‌ వినియోదారులకు 25 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది. జియో కనెక్షన్‌ను ఉపయోగిస్తున్న ఇంటెక్స్ 4 జీ స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ రూ.309 లేదా ఆపై రీచార్జీలపై 5 జీబీ లేదా 4 జీబీ డేటాను అందిస్తామని జియో ప్రకటించింది.

జియోతో ఒప్పో ఒప్పందం

జియోతో ఒప్పో ఒప్పందం

గత మాసంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడ జియోతో ఒప్పందం కుదుర్చుకొంది. ఒప్పో కొనుగోలు చేసి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకొన్నవారికి అదనపు డేటాను అందించనున్నట్టు జియో ప్రకటించింది. ఈ ఆఫర్ ఒప్పో ఎఫ్3,ఎఫ్3 ఫ్లస్, ఎప్1 ఫ్లస్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు అదనంగా ఒక్కో రీ ఛార్జీపై 10 జీబీ వరకు ఉచిత డేటా అందించనుంది.

ఆరు రీ ఛార్జీలపై అదనపు డేటా

ఆరు రీ ఛార్జీలపై అదనపు డేటా

ఒప్పో ఎప్1ఎస్, ఏ 37, ఏ 33 మోడల్స్‌కు 7 జీబీ వరకు అదనంగా డేటాను ఇవ్వనుంది జియో. ఆరు జియో రీ ఛార్జీలపై కంపెనీ అదనంగా డేటాను అందించనుంది. ఒప్పో యూజర్లకు ఈ అదనపు డేటా ఉచితంగానే ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

ఉచిత ఆఫర్లతో ఇబ్బందలు

ఉచిత ఆఫర్లతో ఇబ్బందలు

ఉచిత ఆఫర్లతో జియో ఇతర కంపెనీలకు చుక్కలు చూపుతోంది. ఈ ఆఫర్ల కారణంగా తమ కష్టమర్లు జియో వైపుకు వెళ్ళిపోకుండా ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను ఇచ్చేందుకు సిద్దం కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
In collaboration with Reliance Jio, domestic consumer electronics brand Intex Technologies on Friday announced data benefits up to 25GB for its 4G smartphone users.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X