పెళ్లికి ఆహ్వానించాలంటే: బీహార్ సీఎం నితీష్ కుమార్ షరతు!

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: కట్నం తీసుకోని వారు మాత్రమే తనను పెళ్లికి ఆహ్వానించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 2ను పురస్కరించుకొని ఆయన కట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో ఆయనను చాలామంది పెళ్లిళ్లకు ఆహ్వానిస్తున్నారు. దీనిపై సోమవారం మాట్లాడారు. తనను పెళ్లికి ఆహ్వానిస్తున్న వారు అందరూ కట్నం తీసుకోని వారు అయి ఉండాలన్నారు.

 To invite me for marriage, speak out that no dowry has been taken: Nitish Kumar

ఈ సందర్భంగా నితీష్ పెళ్లి గురించి విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ.. తన పెళ్లి విషయాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలని, 1973లో లాలా లజ్‌పత్‌ రాయ్‌ ఫంక్షన్‌ హాల్‌లో తన వివాహ వేడుక జరిగిందని, దీనికి హాజరైన ప్రముఖులు వరకట్నాన్ని వ్యతిరేకిస్తూనే ఎక్కువ ప్రసంగాలు ఇచ్చారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bihar Chief Minister Nitish Kumar today said those inviting him for marriage would have to speak out that no dowry has been taken.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి