IPL 2023 : ఐపీఎల్ మధ్యలోనే జియో సినిమా పెయిడ్ సబ్ స్క్రిప్షన్-ప్లాన్ల వివరాలివే..

ఐపీఎల్ 2023 సీజన్ ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని పొందిన జియో సినిమా యాప్ 4కే కంటెంట్ అందించడం ద్వారా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మైదానంలో పలు వ్యూలను యాప్ లో అందుబాటులో ఉంచడం ద్వారా అభిమానుల్ని గ్రౌండ్ లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ తెస్తోంది. ఇదే క్రమంలో జియో సినిమా యాప్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకూ ఫ్రీగా అందిస్తున్న మ్యాచ్ కంటెంట్ కు ఇకపై సబ్ స్క్రిప్షన్ వసూలు చేయాలని భావిస్తోంది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ముందే ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను అమల్లోకి తెచ్చేందుకు జియో సినిమా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్ల వివరాలు కూడా లీకయ్యాయి. వీటి ప్రకారం మొత్తం మూడు ప్లాన్లను జియో సినిమా ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. వీటిలో డెయిలీ పేరుతో ఉండే తొలి ప్లాన్ లో రోజుకు రూ.29 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ పేరుతో ఉండే రెండో ప్లాన్ లో 3 నెలలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. చివరిగా ప్లాటినం ప్లాన్ లో ఏడాదికి రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.

IPL 2023

మరోవైపు రోజుకు రూ.29 చొప్పున ఉండే డెయిలీ ప్లాన్ లో రెండు డివైజుల్లో కంటెంట్ చూసే అవకాశం కల్పించనుంది. అలాగే 3 నెలలకు రూ.299ల గోల్డ్ ప్లాన్ లోనూ రెండు డివైజ్ లో కంటెంట్ చూడొచ్చు. రూ.599తో ఏడాదికి ప్లాటినమ్ ప్లాన్ తీసుకుంటే మాత్రం నాలుగు డివైజ్ ల వరకూ కంటెంట్ ను వీక్షించే అవకాశం కల్పించాలని జియో స్టూడియోస్ భావిస్తోంది. ఈ ప్లాన్ల వివరాలను త్వరలో జియో సినిమా బయటపెట్టే అవకాశం ఉందని అంచనా.

IPL 2023

మే 28న జరిగే ఐపీఎల్ 2023 ఫైనల్‌కు ముందు, జియో సినిమా క్రీడా ఈవెంట్‌లతో సహా ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని కంటెంట్‌ల కోసం కొత్త ప్లాన్‌లు, ధరలను విడుదల చేస్తుందని తెలుస్తోంది. Viacom18 మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించారు. కానీ కొత్త ధరల వ్యూహం IPL 2023పై ప్రభావం చూపదని JioCinema అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+