IPL 2023: ప్లే ఆఫ్ లోకి దర్జాగా ఆ రెండు టీమ్ లు! మరో రెండు బెర్తుల కోసం ఐదుగురి పోటీ?
ఐపీఎల్ 2023లో లీగ్ దశ చివరికి చేరుకుంటోంది. త్వరలో ప్లే ఆఫ్ సమరం మొదలుకావాల్సి ఉంది. అయితే లీగ్ దశలో అన్ని జట్లూ ప్లే ఆఫ్ రేసు కోసం పోటీ పడుతుండగా.. కేవలం నలుగురికి మాత్రమే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. అయితే ఆ నలుగురు ఎవరన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వివిధ జట్ల తాజా పరిస్ధితి ఏంటి ? ప్లే ఆఫ్ కు చేరేందుకు వారికున్న అవకాశమెంత అనే దాన్ని ఓసారి పరిశీలిద్దాం..
ఐపీఎల్ 2023లో ఇంకా 18 మ్యాచ్ లు మిగిలున్నాయి. వీటిలో ప్లే ఆఫ్స్ కు వెళ్లే నాలుగు జట్లు డిసైడ్ కాబోతున్నాయి. ఈ సీజన్లో లీగ్ దశ మే 21న ముగియబోతోంది. ప్లేఆఫ్‌లు మే 23న చెన్నైలో ప్రారంభమవుతాయి. ఫైనల్ మే 28న అహ్మదాబాద్‌లో జరుగబోతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిని బట్టి ప్లే ఆఫ్ రేసులోకి వెళ్లే అవకాశమున్న జట్లలో గుజరాత్, లక్నో, చెన్నై, రాజస్తాన్, బెంగళూరు జట్లకు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

గత ఐపీఎల్ ఆధారంగా చూసుకుంటే 8 విజయాలు అంటే కనీసం 16 పాయింట్లు సాధించిన జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఈసారి గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్లే ఆఫ్ కు చేరాలంటే కనీసం 9 విజయాలు అంటే 18 పాయింట్లు అవసరం కాబోతున్నాయి.
ఈ లెక్కన చూస్తే గుజరాత్ మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ స్ధానం ఖరారు చేసుకోవచ్చు.అలాగే 13 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్న చెన్నై మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిస్తే 19 పాయింట్లతో దర్జాగా ప్లే ఆఫ్ కు చేరొచ్చు. రెండు గెలిచినా అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. లేక రెండు గెలిచినా పోటీలో ఉంటుంది.
ఇక 11 పాయింట్లతో ఉన్న లక్నో కచ్చితంగా 3 మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అలాగే 10 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ సైతం 3 విజయాలు నమోదు చేసుకుంటే ప్లే ఆఫ్ లో చివరి జట్టుగా అవకాశం ఉండొచ్చు. ఈ రెండు జట్లూ వీరికి మిగిలిన మూడు మ్యాచ్ లు కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు పెట్టుకోవచ్చు.
అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మిగిలిన 4 మ్యాచ్ ల్లో మూడు లు గెలిస్తే ప్రస్తుతం ఉన్న 10 పాయింట్లకు మరో 6 పాయింట్లు తోడై మెరుగైన రన్ రేట్ షరతుతో ప్లే ఆఫ్ అవకాశం ఉండొచ్చు. ముంబై, పంజాబ్ పరిస్ధితి కూడా అదే. మిగిలిన 4 మ్యాచ్ ల్లో ఈ రెండు జట్లూ అన్నీ కానీ కనీసం 3 గానీ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ పోటీలో ఉండే అవకాశం ఉంది. రన్ రేట్ కూడా కీలకం.
ఇక ఎనిమిదేసి పాయింట్లతో ఉన్న కోల్ కతా, హైదరాబాద్, ఢిల్లీ మూడు జట్లూ తమకు మిగిలిన 4 మ్యాచ్ లూ గెలిచినా మరో 8 పాయింట్లు తోడై 16 పాయింట్లు లభిస్తాయి. కానీ ప్లే ఆఫ్ రేసులో ముందున్న చెన్నై, బెంగళూరు, లక్నో, ముంబై జట్లతో ఆడే మ్యాచ్ ల్లో ఈ మూడు జట్లు గెలిస్తే సమీకరణాలు మారొచ్చు.
కానీ ఈ జట్లు మాత్రం ప్లే ఆఫ్ కు చేరడం మాత్రం కష్టమే. ఈ లెక్కన చూస్తే గుజరాత్, చెన్నై కచ్చితంగా ప్లే ఆఫ్ చేరబోతుండగా.. లక్నో, రాజస్తాన్, బెంగళూరు, ముంబై, పంజాబ్ లో రెండుజట్లు మిగిలిన మ్యాచ్ ల్లో అన్నీ కానీ గరిష్టంగా కానీ గెలవడంతో పాటు రన్ రేట్ కాపాడుకుంటే మిగిలిన రెండు బెర్తులకు అర్హులవుతాయి.












Click it and Unblock the Notifications