ఐపీఎల్ బెట్టింగ్: రంగంలోకి దిగిన ఈడీ, సోదాలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దెబ్బతో ఇంత కాలం దర్జాగా బెట్టింగ్ నిర్వహించిన బుక్కిలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు. శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, ముంబైతో పాటు పలు నగరలలో సోదాలు చేస్తున్నారు. ఐపీఎల్ -8 భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెట్టింగ్ ప్రమేయం ఉన్న బుకీ అనూప్ మహాజన్ అనే వ్యక్తిని పఠాన్ కోట్ పోలీసులు మే 21వ తేదీన అరెస్టు చేశారు. అతని దగ్గర నుండి రూ. 3.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను తెలిపిన వివరాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
అనూప్ మహాజన్ తో పాటు ఐదుగురిని పఠాన్ కోట్ పోలీసులు అరెస్టు చేసి 13 మొబైల్ లు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ దర్యాప్తుకు పలు నగరాల పోలీసులు పూర్తి సహకారం అందిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల కోసం గాలిస్తున్నారు.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications