ఐపీఎల్: కొత్త రూల్స్ కెప్టెన్ కాళ్లకు బంధాలా... బ్యాట్స్‌మన్‌లకు పరుగుల పంటేనా?

రోబోలు క్రికెట్ ఆడుతుంటే ఎంత కృత్రిమంగా ఉంటుంది ? రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఆటగాళ్ల స్థానంలో యంత్రాలు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ? ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ సీజన్-14 కాస్త అటు ఇటుగా అలాగే ఉండబోతోంది.
ఈసారి ఐపీఎల్‌లో అనేక మార్పులు ఉండబోతున్నాయి. ఏ బౌలర్ కూడా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం కుదరదు. మైదానంలో సహచర ఆటగాళ్లకు ఫీల్డింగ్‌లో పదే పదే సూచనలిచ్చే బౌలర్లు ఇక కనిపించరు.
బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి చిన్న చిన్న విరామాలు ఇకపై సాగవు. అంతేకాదు..బ్యాట్స్‌మన్ తన బంతులను చితక బాదుతుంటే, కెప్టెన్ నుంచి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం, స్వేచ్ఛ కూడా బౌలర్‌కు ఉండదు.
ఐపీఎల్‌లో కొత్తగా చేర్చిన ఒక రూల్ వల్ల ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలతో రాబోయే సీజన్‌లో ఆడబోతున్న 88 మంది ఆటగాళ్లు రోబోల్లా కనిపించబోతున్నారు.
- ఐపీఎల్ 2021: కొత్త నిబంధనలు, పాత ఆటగాళ్లతో ఐపీఎల్-14 ఎలా ఉండబోతోంది?
- సాఫ్ట్ సిగ్నల్: సూర్యకుమార్ యాదవ్ ఔటైన ఈ నిబంధనపై ఎందుకింత చర్చ?

ఏమిటీ కొత్త రూల్స్?
ఈ కొత్త రూల్ ప్రకారం ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో 20 ఓవర్లను కేవలం 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లు వ్యూహాలు రచించుకునే సమయం కూడ ఈ 90 నిమిషాల్లోనే ఉంటుంది.
ఈ నియమాల కారణంగా ప్రతి జట్టు త్వరగా బౌలింగ్‌ను పూర్తి చేసేందుకు వీలుగా స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
ఫాస్ట్‌బౌలర్లు దూరం నుంచి పరిగెత్తుకుంటూ రాకుండా, వీలయినంత దగ్గర్నుంచే బాల్‌ను విసిరే ప్రయత్నం చేస్తారు. నిర్ధారిత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయలేకపోయిన జట్టు జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ జరిమానా కూడా భారీగానే ఉంది. 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయని కెప్టెన్‌కు 12 నుంచి 30 లక్షల రూపాయల జరిమానాతోపాటు, ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో, ఏ కెప్టెనైనా చేయగలిగింది ఒక్కటే. స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడటం.
ఈ నిబంధనల కారణంగా ఫీల్డ్‌లోని ఆటగాళ్లంతా యంత్రాల్లాగా కదులుతుంటారని చెప్పక తప్పదు.
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?

క్రికెట్ గేమ్ ఎలా మారిపోయింది?
విశ్రాంతిగా కూర్చుని చూసే గేమ్‌గా ఇంగ్లాండ్‌లో క్రికెట్ ప్రారంభమైంది. కానీ యువతకు ఐదు రోజులపాటు మ్యాచ్ చూసే ఓపిక లేదన్న గ్రహింపు వచ్చాక, 1970లలో వన్డే క్రికెట్ మొదలైంది.
ఆ తర్వాత టీ20 కూడా ఇంగ్లాండ్‌లోనే మొదలైంది.
కానీ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. అమెరికాలోని నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ తరహాలో ఐపీఎల్ మొదలైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపకర్త లలిత్ మోదీ ఈ గేమ్‌ను ప్రారంభించేనాటికి బీసీసీఐలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి. అప్పటికే ఆయన అమెరికాలో చాలా కాలం నివసించి వచ్చారు.
ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఐపీఎల్ ఐడియాను అమలులో పెట్టడానికి సిద్ధమయ్యారు. చివరకు ఇండియాలో టీవీ సీరియళ్లకు పోటీనిచ్చే గేమ్‌ను రూపొందించగలిగారు.
ఈ కొత్త తరహా క్రికెట్ లీగ్ విషయంలో మొదట్లో ఆయనకు కొంత వ్యతిరేకత ఎదురైనా, ఇది కాసులు కురిపించే ఆటగా పేరు తెచ్చుకుంది.
పాత తరం క్రికెటర్లకు పెద్ద మొత్తాలు అప్పజెప్పి ఆయన వారిని ఈ ఆట కోసం ఉపయోగించుకున్నారు. మొదట్లో ఈ లీగ్‌ను వ్యతిరేకించిన మన్సూర్ అలీఖాన్ పటౌడీలాంటి సీనియర్లు కూడా చివరకు ఈ మార్గంలోకి వచ్చారు.
- హెచ్‌సీఏ రాజకీయాల వల్లే హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం లేదా.. దీనికి కారణం ఎవరు
- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మొదటి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఓటమికి ఐదు కారణాలు ఇవీ...

ఆటగాళ్ల ఫిట్‌నెస్ పెరిగింది...మరి ఆట?
అప్పటి వరకు సాగిన క్రికెట్ ఆట తీరును ఐపీఎల్ ఆరంభంలోనే మార్చేసింది. మైదానంలో ఉన్న ఆటగాళ్లు గతం కన్నా భిన్నంగా అన్ని విభాగాల్లో దూకుడైన ఆటకు ప్రాధాన్యమిచ్చారు.
స్టేడియం దాటేలా బంతులను బాదడం, గాల్లోకి ఎగిరి బాల్‌ను క్యాచ్ చేయడం, బ్యాట్స్‌మన్‌కు పరుగులు దక్కకుండా వాయు వేగంతో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీల దగ్గర బంతిని అడ్డుకోవడంలాంటివి విపరీతంగా కనిపించడం మొదలు పెట్టాయి.
అయితే ఈ సందడిలో ఆటలోని స్కిల్ మాత్రం మాయమైందని చెప్పాలి. క్రికెట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా మారింది.
ఈ క్రమంలోనే టెక్నాలజీ వాడకం కూడా ఎక్కువైంది. అంపైర్లకు బదులు కెమెరాలను నమ్ముకోవడం పెరిగింది.
- అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?

ఈ మార్పు ఎలా ఉండబోతోంది?
90 నిమిషాలలో 20 ఓవర్లను పూర్తి చేయడం ఎంత పెద్ద సవాలో ఊహించుకోవచ్చు. నాలుగు నిమిషాల్లో ఒక ఓవర్‌ను పూర్తి చేయాలని ఎంత మొనగాడు బౌలర్‌కైనా యాజమాన్యాలు ఆదేశాలు ఇచ్చి తీరతాయి.
అంటే దిల్లీ డేర్ డెవిల్స్‌కు చెందిన రబడా లాంటి బౌలర్ కూడా ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడక్కడే నాలుగడుగులు వేసి తన ఓవర్‌ను నాలుగు నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట.
కొత్త రూల్ ప్రకారం ప్రతి జట్టు గంట సమయంలో 14.11 ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కారణాల వల్లనైనా ఆటను 20 ఓవర్లకన్నా తక్కువకు కుదిస్తే అప్పుడు ఒక్కో ఓవర్‌ను 4 నిమిషాల 15 సెకండ్లలో వేసే అవకాశం కూడా లేకుండా పోతుంది.
అంతకకన్నా తక్కువ సమయంలోనే ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
పెనాల్టీ ఎలా విధిస్తారు ?
ఒక వేళ బౌలింగ్‌ను నిర్ధారిత సమయంలో పూర్తి చేయకపోతే విధించే జరిమానాలు వివిధ రకాలుగా ఉంటాయి.
మొదటిసారి అయితే... కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమాన
రెండోసారి జరిగితే....కెప్టెన్‌కు రూ. 25 లక్షలు, ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25శాతం కోత లేదంటే రూ.6లక్షల జరిమానా ( ఏది తక్కువైతే అది)
మూడోసారి అంతకన్నా ఎక్కువసార్లకు...కెప్టెన్‌కు రూ.30 లక్షల ఫైన్‌తోపాటు ఒక మ్యాచ్ బ్యాన్ విధిస్తారు. మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత లేదంటే రూ.12లక్షలు జరిమానా(ఏది తక్కువైతే అది) పడుతుంది.
- Ind vs Aus: బాక్సింగ్ డే టెస్టుకు ఈ పేరు ఎలా వచ్చింది? క్రికెట్‌తో సంబంధంలేని రోజును అలా ఎందుకు పిలుస్తారు?
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?

ఎవరికి ప్రయోజనం?
ఈ కొత్త నియమాలను జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ బ్యాట్స్‌మన్‌కు ఎక్కువగా ఉపయోగపడతాయన్నది అర్ధమవుతుంది.
గత రెండు దశాబ్దాలుగా క్రికెట్‌లో వస్తున్న మార్పులు ఎక్కువగా బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఉన్నవనే చెప్పాలి.
బ్రాడ్‌మన్ టైమ్‌లో బ్యాట్ అంచును తాకిన బంతి బౌండరీ దాటటానికి వీలు లేదు.
క్రికెట్ ఆట మొదలైన తొలినాళ్లలో అంటే డబ్ల్యూజీ గ్రేస్, మహారాజా రంజిత్ సింగ్ కాలంలో బ్యాట్ మందం ఇప్పుడు డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్స్, ఎమ్మెస్ ధోనీ బ్యాట్‌లంత మందం ఉండేది కాదు.
ఈ కాలంలో తయారవుతున్న బ్యాట్‌ల కారణంగా బంతులు స్టేడియం పైకప్పులను కూడా తాకుతున్నాయి. అందుకే క్రికెట్ నిర్వహణ సంస్థల్లో ఒకటైన ఎంసీసీ బ్యాట్ మందాన్ని తగ్గించాలని నిర్ణయించింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం వార్నర్ వాడుతున్న 85 మిల్లీ మీటర్ల బ్యాట్‌లో కనీసం 18 మిల్లీ మీటర్లు తగ్గించాల్సి ఉంది.
కానీ ఐపీఎల్‌లో ఇప్పుడు రాబోయే సమస్య ఏంటంటే, ఒక ఫాస్ట్ బౌలర్ తాను ఎంత నైపుణ్యంగా బాల్‌ను విసరాలన్నది కాకుండా, ఎంత త్వరగా బౌలింగ్‌ను పూర్తి చేయాలన్నదానిపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఐపీఎల్ కావచ్చు, సాధారణ మ్యాచ్ కావచ్చు...క్రికెట్ అంటే బంతిని బౌండరీ దాటించడం అన్నదే పాయింట్.
ఇవి కూడా చదవండి:
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)