Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Google search:2022లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్ ఇవే..ఇంట్రెస్టింగ్..!!

Google Search:ప్రతి ఏటా చివరిలో గూగుల్‌లో ఎక్కువ మంది ఏం వెతికారో పేర్కొంటూ ప్రముఖ సెర్చ్‌ఇంజిన్ సంస్థ గూగుల్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భాగంగా 2022లో వార్తల పరంగా నెటిజెన్లు ఏం వెతికారో నివేదికలో వెల్లడించింది.అయితే ప్రతి దేశంలో ఆయా దేశపౌరులు ఎలాంటి ట్రెండ్స్ కోసం సెర్చ్ చేశారో గూగుల్ జాబితాను విడుదల చేసింది. అయితే భారత్‌లో పలు సంఘటనలు లేదా ఈవెంట్స్ గురించి ఎక్కువగా నెటిజెన్లు ఏం సెర్చ్ చేశారనేదానిపై లిస్ట్ విడుదల చేసింది.

స్పోర్ట్స్ గురించే ఎక్కువగా...

స్పోర్ట్స్ గురించే ఎక్కువగా...

2022లో నెటిజెన్లు ఎక్కువగా సెర్చ్ చేసింది ఎన్‌టర్‌టెయిన్‌మెంట్, స్పోర్ట్స్. అదే గతేడాది ఎక్కువగా కరోనావైరస్‌పై గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు ఈ టెక్ దిగ్గజ సంస్థ వెల్లడించింది. 2022 ట్రెండింగ్ సెర్చ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జాబితాలో టాప్‌గా నిలిచింది. అంతేకాదు స్పోర్ట్స్‌ రంగంలో నెటిజెన్లు ఎక్కువగా వెతికిన క్రీడ ఏమైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ తర్వాత కరోనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కోవిన్ వెబ్‌ పోర్టల్ గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.

మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2022

మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2022


ఇక ఫిఫా వరల్డ్ కప్ 2022పై కూడా గూగుల్‌లో సెర్చింగ్స్ బాగానే జరిగాయి. దీంతో భారత్‌లో ఫిఫా వరల్డ్‌ కప్‌కు సెర్చింగ్ జాబితాలో మూడవ స్థానం దక్కింది.ఇక నాలుగు ఐదవ స్థానాలు కూడా క్రీడా రంగమే ఆక్యుపై చేసింది. క్రికెట్‌ ఆసియా కప్‌ పై ఎక్కువగా సెర్చ్ చేయగా... ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌పై కూడా బాగా సెర్చ్ చేశారు. దీంతో ఈ ఈవెంట్స్ వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగం కూడా సెర్చింగ్‌‌లో పోటీ పడింది. ముఖ్యంగా బ్రహ్మాస్త్ర చిత్రం 6వ స్థానం దక్కించుకోగా..కేజీఎఫ్ చాప్టర్ -2 9వ స్థానం దక్కించుకుంది.

Near Me కీవర్డ్‌తో కోవిడ్ వ్యాక్సిన్

Near Me కీవర్డ్‌తో కోవిడ్ వ్యాక్సిన్

ఇక "Near me" అనే కీవర్డ్‌తో సెర్చ్ చేసిన వాటిలో అత్యధిక ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ నియర్ మి గురించి సెర్చ్ చేసినట్లు గూగుల్ పేర్కొంది.ఇది 2021లో కూడా ఎక్కువగా సెర్చ్ చేసిన కీవర్డ్‌గా నిలిచింది.దీని తర్వాత ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్ నియర్ మీ, వాటర్‌ పార్క్ నియర్ మీ, మూవీస్ నియర్ మీ తో పాటుగా ట్రావెల్ పై నెటిజెన్లు ఎక్కువగా near me కీవర్డ్‌తో సెర్చ్ చేశారు.

అగ్నిపథ్ స్కీమ్ పై సెర్చ్

అగ్నిపథ్ స్కీమ్ పై సెర్చ్


ఇక 2022లో భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై ఎక్కువగా సెర్చ్ చేశారు. నాటో,ఎన్‌ఎఫ్‌టీ, బ్లాక్ ఫంగస్ పై కూడా సెర్చ్‌లు జరిగాయి. ఇక వ్యక్తుల విషయానికొస్తే భారత్‌లో ఎక్కువగా ఒక వ్యక్తి ఎవరా అని తెలుసుకునేందుకు సెర్చింగ్ బాగా జరిగింది. ఈ జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ నిలిచారు. ఆమె తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఎక్కువ మంది నెటిజెన్లు సెర్చ్ చేశారు. వీరి తర్వాత యూకే కొత్త ప్రధాని రిషి సునాక్, లలిత్ మోదీల గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి చూపినట్లు గూగుల్ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+