బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐపీఎస్ దంపతుల ప్రేమ పెళ్లి, విడాకులు, పాప కోసం భార్య ఇంటి ముందు వీధిలో అర్దరాత్రి ధర్నా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇద్దరు ఐపీఎస్ అధికారులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుటుంబ గొడవల కారణంగా ఐపీఎస్ అధికారులు విడిపోయారు. న్యాయస్థానంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని రాజీ చెయ్యడంతో మళ్లీ ఐపీఎస్ అధికారులు ఒక్కటి అయ్యారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ కుమార్తె విషయంలో ఐపీఎస్ అధికారుల సంసారం గొడవలు బజారున పడింది. పాపను చూడాలని భార్య ఇంటి ముందు అర్దరాత్రి ఐపీఎస్ అధికారి ధర్నా చెయ్యడంతో సాటి పోలీసు అధికారులు హడలిపోయారు.

ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!

చత్తిస్ ఘడ్ లో లవ్

చత్తిస్ ఘడ్ లో లవ్

ఐపీఎస్ అధికారులు ఇలాకియా కరుణాకరన్, అరుణ్ రంగరాజన్ చత్తిస్ ఘడ్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఐపీఎస్ అధికారులు కావడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించారు. ఆ సమయంలో ఇద్దరు కర్ణాటకకు బదిలి చేయించుకోవాలని ఇలాకిమా భర్త అరుణ్ రంగరాజన్ కు చెప్పారని తెలిసింది.

బదిలి కోసం భర్త మీద ఒత్తిడి!

బదిలి కోసం భర్త మీద ఒత్తిడి!

కర్ణాటకకు బదిలి చేయించుకోవడం అరుణ్ రంగరాజన్ కు ఇష్టం లేదని తెలిసింది. ఆ సమయంలో అరుణ్ కు ఇష్టం లేకపోయినా ఆయన సంతకంతో భార్య ఇలాకియానే ప్రభుత్వానికి బదిలి కోపం లేఖ రాశారని, తరువాత బదిలి చెయ్యం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపిందని సమాచారం. చివరికి ఉన్నతాధికారులను సంప్రదించిన ఇలాకియా, అరుణ్ వారి అనుమతితో కర్ణాటకు బదిలి చేయించుకున్నారు.

దంపతుల విడాకులు

దంపతుల విడాకులు

కుటుంబ సమస్యలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఇలాకియా, అరుణ్ దంపతుల మధ్య పచ్చ గట్టివేస్తే భగ్గుమనేదని తెలిసింది. తరువాత ఇలాకియా, అరుణ్ ఇద్దరూ కోర్టులో విడాకులు తీసుకున్నారు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ చెయ్యడంతో ఇలాకియా, అరుణ్ దంపతులు మళ్లీ ఒక్కటి అయ్యారు.

బెంగళూరులో భార్య డీసీపీ

బెంగళూరులో భార్య డీసీపీ

విడాకులు తీసుకుని ఒక్కటై కాపురం చేసిన ఇలాకియా, అరుణ్ దంపతులకు ఓ పాప పుట్టింది. బెంగళూరులోని వీవీఐపీ భద్రతా విభాగంలో ఇలాకియా డీసీపీగా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల అరుణ్ కు కులబరిగి ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ డీగా బదిలి అయ్యింది. తరువాత దంపతుల మధ్య మళ్లీ గొడవలు మొదలైనాయి.

భార్య ఇంటి ముందే ధర్నా!

సెలవుల మీద కులబరిగి నుంచి బెంగళూరు వచ్చిన అరుణ్ ఇక్కడి వసంతనగర్ లో నివాసం ఉంటున్న భార్య ఇలాకియా ఇంటి దగ్గరకు వెళ్లారు. పాపను చూడటానికి తనకు అవకాశం ఇవ్వాలని అరుణ్ చెప్పడంతో అందుకు భార్య ఇలాకియా నిరాకరించారని తెలిసింది. భార్య ప్రవర్తన మీద విసిగిపోయిన భర్త అరుణ్ ఇలాకియా ఇంటి ముందే ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న హైగ్రౌండ్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఐపీఎస్ అధికారి అరుణ్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

నో చెప్పిన లేడీ డీసీపీ

నో చెప్పిన లేడీ డీసీపీ

పాపను చూడకుండా తాను ఇక్కడి నుంచి వెళ్లనని అరుణ్ తేల్చి చెప్పారు. హై గ్రౌండ్స్ పోలీసులు సైతం ఇలాకియాకు నచ్చచెప్పి పాపను అరుణ్ ను చూపించడానికి ప్రయత్నించారు. అయితే తన భర్త అరుణ్ కు పాపను చూపించడానికి ఇలాకియా నిరాకరించడంతో అర్దరాత్రి పోలీసులు తలలు పట్టుకున్నారు. పై అధికారులు జోక్యం చేసుకుని త్వరలో పాపను చూడటానికి మీకు అవకాశం కల్పిస్తామని అరుణ్ కు నచ్చ చెప్పడంతో ఆయన ధర్నా విరమించారు. మొత్తం మీద ఇద్దరు ఐపీఎస్ అధికారుల సంసారం గొడవ బజారులో పడటంతో పోలీసులు అధికారులు హడలిపోయారు.

English summary
IPS officer Arun Rangarajan sits dharna infront of his wife house in Bengaluru, IPS officer Ilakkiya Karunakaran in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X