మొత్తం రైలు.. లేదంటే బోగీ.. ఇలా..
తన కుటుంబంతోపాటు స్నేహితుల కుటంబాలతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైలు బోగీనే (coach) బుక్ చేసుకోవచ్చు. అవసరమనుకుంటే మొత్తం రైలు కూడా బుక్ చేసుకోవచ్చు!. ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలను తెలుసుకుందాం..
కోచ్ లేదా రైలు మొత్తాన్ని బుక్ చేసుకోవడాన్ని ఫుల్ టారిఫ్ రేట్ (FTR) బుకింగ్ అంటారు. దీనికోసం ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణించాలనే వివరాలను నమోదు చేయాలి. ఆన్ లైన్ లోనే పేమెంట్స్ పూర్తిచేయవచ్చు. మనకు ఏసీ బోగీ కావాలా? స్లపీర్ కావాలా? ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు.

FTR బుకింగ్ కు సంబంధించి ముఖ్య విషయాలు..
* 6 నెలల ముందు లేదంటే నెలరోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు.
* ఒక రైలులో రెండు బోగీలు బుక్ చేసుకోవచ్చు. అయితే బోగీని తొలగించడానికి, యాడ్ చేయడానికి అనువుగా 10 నిముషాలు అంతకంటే ఎక్కువ సమయం ఆగే స్టేషన్ల నుంచే బుక్ చేసుకోవడానికి అనుమతిస్తారు.
* రైలు మొత్తం కావాలనుకుంటే 18 నుంచి 24 బోగీలకు అనుమతిస్తారు.
* సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో బోగీకి రూ.50వేలు చెల్లించాలి. 18 బోగీలున్న రైలుకైతే రూ.9 లక్షలు చెల్లించాలి.
* ప్రయాణం పూర్తయిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ తిరిగిస్తారు.
* కావాలనుకుంటే ఆహారం అందించే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది.
* ఎటువంటి రాయితీలు ఈ బుకింగ్ లో ఇవ్వరు.
* బుకింగ్ లో ఏవైనా సమస్యలుంటే జోనల్ స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications