Monsoon: గాల్గోనే ఆవిరైపోతున 25శాతం వర్షం..! IITM షాకింగ్ రిపోర్ట్..!

రుతుపవన వర్షాల (Monsoon) కోసం ప్రతీ ఏటా ఎదురుచూసే భారతదేశంలో చివరికి పడే వర్షాల్లో సైతం నాలుగోవంతు గాల్లోనే ఆవిరైపోతున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల సమయంలో వాయువ్య కనుమలపై కురిసే వర్షంలో 25 శాతం గాల్లోనే ఆవిరైపోతున్నట్లు పూణేకు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) తన అధ్యయనంలో గుర్తించింది. మన దేశంలో ఓ ప్రయోగం ద్వారా తొలిసారి ఈ నిష్పత్తిని కొలిచారు.

ప్రతీ ఏటా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే 4 రుతుపవన మాసాలలో కురిసే వర్షం వాస్తవ పరిమాణం రోజురోజుకీ మారుతూ 4%-61% వరకు ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ కనుమలపై వర్షపు బిందువుల ఆవిరిని కొలవడంతో ఇదే పద్దతితో దేశవ్యాప్తంగా పరిశోధన నిర్వహించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పరిశోధన అట్మాస్ఫియరిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనే పీర్-రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురించారు.

Why 25 of India s Monsoon Rain Never Reaches the Ground IITM Pune Explains
Weak Monsoon: బలహీన రుతుపవనాలతో ధరల మంట ? అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ అంచనా..!
Weak Monsoon: బలహీన రుతుపవనాలతో ధరల మంట ? అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ అంచనా..!

దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను మ్యాప్ చేసే ప్రయత్నంలో పూణే ఫలితం మొదటి అడుగుగా భావిస్తున్నారు. రాజస్థాన్ నుండి వర్షాలతో తడిసిన తీరప్రాంతం వరకు, ఉష్ణోగ్రత, తేమను బట్టి ఈ ప్రక్రియ తీవ్రంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఐఐఐటిఎమ్ ఇప్పటికే హిమాలయాల నుండి ఈశాన్యం, పోర్ట్ బ్లెయిర్ వరకు 99 ప్రదేశాలలో వర్షపునీటి-ఐసోటోప్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ దశాబ్ద కాలంగా నమూనాల సేకరణ జరుగుతోంది. ఇందులో ఒక వర్షపు బిందువు కిందకు పడుతున్నప్పుడు ఆవిరైపోతే, అది చుట్టుపక్కల గాలి నుండి వేడిని గ్రహించి, మేఘాల దిగువ పొరను చల్లబరుస్తుందని గుర్తించారు.

Why 25 of India s Monsoon Rain Never Reaches the Ground IITM Pune Explains
Super El Nino: కరెంట్ కే షాకివ్వబోతున్న సూపర్ ఎల్ నినో- భారత్ పై తీవ్ర ప్రభావం..!
Super El Nino: కరెంట్ కే షాకివ్వబోతున్న సూపర్ ఎల్ నినో- భారత్ పై తీవ్ర ప్రభావం..!

దాదాపు పావు వంతు వర్షపాత నష్టం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల అంచనాతో పోలిస్తే తక్కువే. ఉపగ్రహ డేటా ఆధారిత కొలతల ప్రకారం, ఉష్ణమండల ప్రాంతాలలో బాష్పీభవనం దాదాపు 20%గా ఉంది. జ్యూరిచ్‌లో ఇది సుమారు 40%, బార్బడోస్ సమీపంలో దాదాపు 60%గా ఉంది. బార్బడోస్‌లోని చిన్న నీటి బిందువులు, పొడి గాలి దీనికి కారణం. బాష్పీభవనం తేలికపాటి వర్షంలోని చిన్న బిందువులను తొలగిస్తుంది, భారీ కుండపోత వర్షంలోని పెద్ద బిందువులను దాదాపుగా ప్రభావితం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+