ఢిల్లీలో కాల్పుల కలకలం: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చేరిక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ఆవరణలో ఐఆర్‌సీటీసీకి చెందిన కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ మహామ్మద్ హైదర్ (35)కు తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే అతడిని చికిత్స్ కోసం సమీపంలోని ఎయిమ్స్‌కు తరలించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఢిల్లీలో కాల్పులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం దిగ్ర్బాంతికి గురైంది. కేంద్ర హోం శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

కారుని వివేక్ ట్రావెల్స్‌కు చెందిందిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ కారుని ఐఆర్‌సీటీసీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ ఏకే మనోచా లీజ్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన సమయంలో కారులో ఏకే మనోచా లేరని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు హైదర్‌పై జరిగాయో లేదా ఏకే మనోచాను దృష్టిలో పెట్టుకుని పేల్చారా అనేది తెలియరాలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications