లాలూ ఫ్యామిలీకి చెందిన రూ.45కోట్ల విలువైన భూమి జప్తు
పాట్నా: రైల్వే హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టు కేటాయింపునకు సంబంధించిన అవినీతి కేసులో ఆర్జేడి నేత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులకు చెందిన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. పాట్నాలో రూ.45కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలికంగా జప్తు చేసింది.

యూపీఏ హయాంలో లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా.. ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అక్రమంగా అప్పగించారన్నది ప్రధాన అభియోగం.
ఇందుకు ప్రతిఫలంగా పట్టణంలో ఖరీదైన భూమిని లాలూ కుటుంబం పొందిందన్న ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్‌ను ఇప్పటికే ప్రశ్నించింది. లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications