షర్మిల కొత్త రాజకీయ పార్టీ: 'ఈల' గుర్తు కోసం దరఖాస్తు..

తాజాగా తమ పార్టీ పీఆర్‌జేఏకి ఎన్నికల గుర్తుగా ఈలను కేటాయించాలంటూ షర్మిల దరఖాస్తు చేసుకున్నారు.

ఇంఫాల్: మణిపూర్ లో సాయుధ బలగాల తొలగింపు కోసం పదహారేళ్ల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా దీక్ష చేసిన ఇరోమ్ షర్మిల.. గతేడాది అగస్టు9న తన దీక్షకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.

పోరాట పంథాను రాజకీయం వైపు మళ్లించి.. గతేడాది అక్టోబర్ లో ఆమె పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్(పీఆర్‌జేఏ) పార్టీని స్థాపించారు.

Irom Sharmila

పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం.. వారితో మమేకమవడం, క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పరచడం వంటి విషయాల మీద షర్మిల కసరత్తులు చేస్తూ వస్తున్నారు. తాజాగా తమ పార్టీ పీఆర్‌జేఏకి ఎన్నికల గుర్తుగా ఈలను కేటాయించాలంటూ షర్మిల దరఖాస్తు చేసుకున్నారు.

పార్టీ కన్వీనర్ ఎరెండ్రో ఈ విషయాన్ని వెల్లడించారు. అవినీతిపై పోరాటంలో ప్రజలను మేల్కొల్పడమే ప్రధానంగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని ఎరెండ్రో స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+