ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి: దేశవ్యాప్తంగా ఏక్తా దివస్; యూనిటీ ర్యాలీలు!!

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని మోడీ
జాతీయ ఐక్యతా దినోత్సవం పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జాతి ఘనంగా నివాళులర్పిస్తోంది. ఢిల్లీలో ఆయన విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. గుజరాత్ లోని కెవాడియాలో ఈ రోజు జరిగిన ఐక్యతా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఏక్తా దివస్ వేడుకలలో త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. దేశ సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తామని అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని మోడీ


జాతీయ ఐక్యతా దినోత్సవం పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జాతి ఘనంగా నివాళులర్పిస్తోంది. ఢిల్లీలో ఆయన విగ్రహం వద్దరాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. గుజరాత్ లోని కెవాడియాలో ఈ రోజు జరిగిన ఐక్యతా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఏక్తా దివస్ వేడుకలలో త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. దేశ సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తామని అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా


సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్ లో ఆయన చిత్రపటానికి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. భారత జాతి ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటేల్ చౌక్ లోని ఆయనచిత్ర పటానికి అమిత్ షాపూలమాల వేసి నివాళులు అర్పించారు. పటేల్ జన్మదినాన్ని ఏక్తా దివస్ గా పాటిస్తున్నామని , దేశం కోసం వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని అమిత్ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు.

హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


ఇక జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వల్లభబాయ్ పటేల్ విగ్రహానికికేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ జి. కిషన్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. పీపుల్స్ ప్లాజా నుంచి శాసనసభ ఎదురుగా గల పటేల్ విగ్రహం వరకు సాగినఐక్యతా పరుగునుజెండాఊపి మంత్రి ప్రారంభించారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం చేసిన కృషిని మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రంలోనూ అన్ని జిల్లాలలో యూనిటీ రన్ నిర్వహించారు. యువత దేశం కోసం ముందుకు రావాలని యువజన మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+