బెంగళూర్ ఎగ్జిక్యూటివ్ ఎఫెక్ట్: భారత్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై బ్యాన్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల సంస్థను భారత ప్రభుత్వం మంగళవారం నిషేధించింది. బెంగళూరు సంస్థలో పనిచేస్తున్న మెహిదీ అనే ఇంజనీర్ ఐఎస్ మిలిటెంట్ల కోసం మద్దతుదారుల్ని సమీకరిస్తూ పట్టుబడిన నేపథ్యంలో నిషేధ నిర్ణయం తీసుకున్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇస్లామిక్ మిలిటెంట్ల వ్యాప్తిని నిరోధించే తొలి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
నిషిద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై నిషేధ నిర్ణయం తీసుకున్నామని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధన, అణచివేత ( భద్రతామండలి తీర్మానాల అమలు)కు సంబంధించిన నిబంధనల ప్రకారమే ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై వేటు వేశామని వివరించారు. మొదట్లో ఇరాన్, సిరియాలకే పరిమితమైనా అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ జిహాదీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

భారత దేశంలో ఐఎస్‌ఐఎస్‌కు కనిష్ఠ స్థాయిలోనే మద్దతు ఉందని అయితే వీరికి ఈ మిలిటెంట్ సంస్థతో ఏ రకమైన సంబంధాలున్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు.ఇస్లామిక్ జిహాదీల ప్రభావానికి గురికాకుండా దేశంలోని అనేక ముస్లిం కుటుంబాలు తమ పిల్లల్ని రక్షించుకున్నామని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ జిహాదీ సంస్థ కార్యకలాపాల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్న ప్రభుత్వం ఈ దిశగా అన్ని నిరోధక చర్యలూ తీసుకుంటోందని వివరించారు.
ఇరాక్‌లో ఆల్ ఖైదాను ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి దశాబ్దం కిందట నిషేధించింది. ఐస్ ట్వీటర్ మెహిదీ మస్రూర్ బిశ్వాస్ ఐస్‌తో సంబంధాలు పెట్టుకున్నాడని తేలితే ఐక్య రాజ్యసమితి తీర్మానం మేరకు ఉగ్రవాద సంస్థకు మద్దతు తెలిపినందుకు అతనిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications