Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్ కుంద్రా ఏమైనా ఉగ్రవాదా ? ప్రశ్నించిన న్యాయవాది .. పోర్నోగ్రఫీ కేసులో ముంబై హైకోర్టు బెయిల్ నిరాకరణ

పోర్నోగ్రఫీ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పేకు ముంబై హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అశ్లీల కంటెంట్ నిర్మాణం మరియు యాప్స్ లో అప్లోడ్ చేసిన కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బెయిల్ దరఖాస్తును ముంబై కోర్టు తిరస్కరించింది.రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ ను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుదీర్ భాజీ పూలే తోసిపుచ్చారు.

Recommended Video

    Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
    రాజ్ కుంద్రా కేసు ..ముంబై హైకోర్టులో హోరాహోరీగా సాగిన వాదనలు

    రాజ్ కుంద్రా కేసు ..ముంబై హైకోర్టులో హోరాహోరీగా సాగిన వాదనలు


    ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోందని, కుంద్రాకు బెయిల్ మంజూరు చేయరాదని, ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే, అతను సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఇన్వెస్టిగేటివ్ అధికారి కిరణ్ బిద్వే కోర్టుకు తెలిపారు. అంతేకాక ఇంకా ఈ కేసులో కొంత మంది వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రాజ్ కుంద్రా పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్న రాజ్ కుంద్రా తరపు న్యాయవాది తన క్లైంట్ నివాసం ముంబై లోనే ఉందని, కుటుంబం ముంబైలోనే ఉంటుందని, ఏ సమయంలోనైనా పోలీసులకు అందుబాటులో ఉంటారని, తనను ఇంకా కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు .

    బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి తన క్లయింట్ ఉగ్రవాదా ? ప్రశ్నించిన కుంద్రా లాయర్

    బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి తన క్లయింట్ ఉగ్రవాదా ? ప్రశ్నించిన కుంద్రా లాయర్


    అయితే పోలీసులు రాజ్ కుంద్రా బ్రిటిషర్ అని ఎప్పుడైనా దేశం వదిలి పారిపోయి అవకాశాలు ఉండొచ్చని, ఒకవేళ అతనికి బెయిల్ మంజూరు చేసే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇప్పటికే పోలీసులు అతని పాస్ పోర్ట్ సీజ్ చేశారని, దేశం వదిలి వెళ్ళే అవకాశం లేదని రాజ్ కుంద్రా తరపు న్యాయవాది వాదించారు. బెయిల్ కూడా ఇవ్వకుండా ఉంచడానికి తన క్లయింట్ రాజ్ కుంద్రా ఉగ్రవాదినా? అని ప్రశ్నించాడు రాజ్ కుంద్రా తరపు న్యాయవాది పాండా.

    బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ముంబై హైకోర్టు

    బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ముంబై హైకోర్టు

    తన క్లయింట్ ఇప్పటి వరకు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆపాడా ? పోలీసులతో మాట్లాడకుండా నిర్బంధించారా అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో తన క్లయింట్ కు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూరు చేయడానికి తిరస్కరించింది.ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రస్తుతం రెండు వారాలపాటు రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

    ముంబై హైకోర్టులోనూ రాజ్ కుంద్రాకు చుక్కెదురు

    ముంబై హైకోర్టులోనూ రాజ్ కుంద్రాకు చుక్కెదురు


    గత సోమవారం రాజ్ కుంద్రాతో పాటుగా ఆయన కంపెనీ టెక్ విషయాలను చూసుకున్న అతని దగ్గరి సహాయకుడు ర్యాన్ థోర్ప్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కుంద్రా బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ కుంద్రా అరెస్ట్ చట్టవిరుద్ధం అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి కంటెంట్ అందుబాటులో ఉన్నాయని వాదించారు .

    ముంబై హైకోర్టులోనూ రాజ్ కుంద్రాకు చుక్కెదురు

    ముంబై హైకోర్టులోనూ రాజ్ కుంద్రాకు చుక్కెదురు

    రాజ్ కుంద్రా యొక్క న్యాయవాది అబాద్ పాండా కూడా రాజ్ కుంద్రా కేసులో ఆయన సంస్థ తీసిన వీడియోలను పోర్న్ వీడియోలుగా వర్గీకరించడంపై కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. పోర్న్ వీడియోలకు, ఎరోటికా వీడియోలకు వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిన్న మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటీషన్ తిరస్కరించగా నేడు ముంబై హైకోర్టు బెయిల్ తిరస్కరించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+