యూపీ సీఎంగా మనోజ్ సిన్హా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

లక్నో/ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ నూతన సీఎంగా ప్రస్తుతం కేంద్రంలో రైల్వే, టెలికం శాఖల సహాయ మంత్రిగా పనిచేస్తున్న మనోజ్‌సిన్హా పేరును బీజేపీ అగ్ర నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయంగా యూపీ ఎంతో కీలకమైంది. కనుకనే ఆ రాష్ట్ర సీఎం పదవికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరుల పేర్లు బీజేపీ నాయకత్వం ద్రుష్టిలో ఉన్నాయి.

చివరి క్షణంలో మార్పు చోటు చేసుకునే అంశాన్ని కొట్టి పారేయలేమని ఆ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఘజియాబాద్ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం రైల్వే, టెలికం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్న మనోజ్ సిన్హాను బీజేపీ నాయకత్వం యూపీ సీఎంగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయన ఐఐటియన్ కావడంతోపాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి కూడా. కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.

Is Manoj Sinha next UP chief minister?

దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‍లో ఓబీసీలు, యాదవ్‌లు, దళితులు, అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులు, రాజ్‌పుత్రులు, జాట్లతోపాటు ముస్లింలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రకాల సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఎంను ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ప్రారంభం నుంచే సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ నిశిత ద్రుష్టి సారిస్తున్నది. తొలుత యాదవేతర ఓబీసీ నేతను సీఎంను చేయాలని తలపెట్టింది. భవిష్యత్‌లోనూ యాదవేతర ఓబీసీల విశ్వాసాన్ని చూరగొనే లక్ష్యాన్ని పెట్టుకున్నది. రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు నడిపించిన నాయకుడిగా బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు.

మనోజ్ సిన్హా సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన భూమిహర్ అయినా రాష్ట్రం అంతటా కులాలకతీతంగా అందరి ఆమోదం సంపాదించగల సామర్థ్యం ఉన్న నేతగా పేరొందారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం ఇబ్బందిగా పరిణమించింది.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత భావాలు గల నేతగా ఆయనకు పేరున్నది. కానీ రాజకీయ నాయకుడిగా, అనుభవం గల నేతగా ఆయన అవసరాలు కేంద్రంలో ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వం ఉత్తరప్రదేశ్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరన్నవిషయం ప్రకటించే అవకాశముంది. అదే రోజు లక్నోలోని స్మ్రుతి ఉప్వన్‌లో ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్రంలోని పలువురు మంత్రులు, సీనియర్ నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister of State for Railways Manoj Sinha is likely to be appointed as the next chief minister of Uttar Pradesh, said sources. With several bigwigs such as Rajnath Singh and Keshav Prasad Maurya being considered for the top post in politically significant state, the BJP sources close to OneIndia said that Sinha has emerged as the party's choice. They, however, also said that last minute changes cannot be ruled out.
Please Wait while comments are loading...