వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ గ్లోబల్ లీడర్ అవుతున్నారా, అమెరికా ఎందుకు పొగడ్తల వర్షం కురిపించింది.

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జో బైడెన్‌‌తో మోదీ

ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సమావేశం అనంతరం 'బాలీ-డిక్లరేషన్’కు సంబంధించిన చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించింది.

''ఇది యుద్ధాలు చేసే కాలం కాదు’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను వైట్‌హౌస్ ప్రశంసించింది.

మోదీ మాటలను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కైరెన్ జీన్ పియరె ఉటంకించారు.

''జీ20 శిఖరాగ్ర సమావేశంలో బాలీ డిక్లరేషన్ చర్చల్లో భారత్ ముఖ్య పాత్ర వహించింది. నేటి యుగం యుద్ధాలకు కాలం కాదు అని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు.

మనకు ఉన్న అనేక ప్రాధాన్యతల మధ్య...ఒక పటిష్టమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నాలను కొనసాగిస్తూ.. ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆహారం, ఇంధన సవాళ్లను దూరం చేసేందుకు ప్రయత్నించాలి’’ అని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ

గ్లోబల్ శక్తిగా ఎదుగుతోన్న భారత్

అమెరికా మీడియా సీఎన్ఎన్, తన సంపాదకీయంలో భారత్‌ను ఆసియాలో కొత్తగా అభివృద్ధి చెందుతోన్న శక్తిగా అభివర్ణించింది.

''యుక్రెయిన్‌పై రష్యా దాడిని నిందిస్తూ జీ20 శిఖరాగ్ర సమావేశంలో అన్ని దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అందులో ఒక ప్రముఖ వాక్యాన్ని ఉటంకించాయి. అదేంటంటే... ''ఇది యుద్ధాలు చేసే కాలం కాదు.’’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వాక్యమే ఇది’’ అని సీఎన్ఎన్ రాసుకొచ్చింది.

రష్యా, పశ్చిమ దేశాలతో భారత్ నేర్పుగా సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు గౌరవించే నేతగా మోదీ ఎదుగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

భారత్‌ను ఒక అంతర్జాతీయ మధ్యవర్తిగా ఉండేలా మోదీ మలిచారని చెబుతున్నారు.

పుతిన్‌తో మోదీ

భారత్, చైనా దేశాలు రష్యా విషయంలో తమ వైఖరిని మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక విశ్లేషణను ప్రచురించింది.

నెలల తరబడి కొనసాగుతోన్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో నేరుగా రష్యాను విమర్శించకుండా భారత్, చైనా దేశాలు తప్పించుకున్నాయి.

కానీ, ఇప్పుడు రష్యాను నిందిస్తూ జీ20 దేశాలు వెలువరించిన సంయుక్త ప్రకటనకు భారత్, చైనాలు అడ్డురాలేదని వాషింగ్టన్ పోస్ట్ తమ విశ్లేషణలో పేర్కొంది.

అమెరికా వైఖరితో సరితూగేలా భారత్, చైనాలు మార్చుకున్న విదేశాంగ విధానంగా దీన్ని చూడొచ్చా? అని ప్రశ్నించింది.

భారత్, చైనాల మద్దతు లేకుంటే యుక్రెయిన్ యుద్ధంలో రష్యాపై ఒత్తిడి పెంచడం అసంభవం అని అమెరికా, దాని మిత్ర దేశాలు నమ్ముతున్నాయి.

భారత్, చైనాలు రష్యాకు కీలక వాణిజ్య భాగస్వాములు.

జీ20 సదస్సులో 'ఇది యుద్ధాలు చేసే యుగం కాదని’ భారత్ అనగా, 'అణుదాడి చేస్తామని బెదిరించడం అనుచితమైనదని’ చైనా వ్యాఖ్యానించింది.

ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పాల్గొనలేదు.

మోదీ

జీ20 సదస్సులో మోదీ ఏమన్నారు?

సదస్సు తొలిరోజు ప్రధాని మోదీ మాట్లాడారు. ''కరోనా మహమ్మారి తర్వాత ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను నిర్మించే బాధ్యత మనందరిపై ఉంది. మనం కలిసికట్టుగా శాంతి భద్రతలను కాపాడేందుకు దృఢమైన సంకల్పాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

బుద్ధుడు, గాంధీ నడిచిన నేలపై జీ20 నేతలు సమావేశమైతే, ప్రపంచానికి శాంతి గురించి బలమైన సందేశాన్ని అందిస్తామని నేను నమ్ముతున్నా.

యుక్రెయిన్‌లో కాల్పులు విరమణ, ఇరుదేశాల మధ్య దౌత్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని నేను పునరుద్ఘాటిస్తున్నా. రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన పెను విధ్వంసం తర్వాత నాయకులు శాంతిని నెలకొల్పడానికి ఎలా ప్రయత్నించారో, మనం కూడా అదే మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది.

నేటి ఎరువుల కొరత రేపటికి ఆహార సంక్షోభంగా మారుతుంది. అప్పుడు దీనికి ప్రపంచం పరిష్కారం చూపదు. కాబట్టి ఎరువులు, ఆహార సరఫరా స్థిరంగా కొనసాగేలా మనం పరస్పరం ఒప్పందం చేసుకోవాలి’’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య 3 గంటల పాటు జరిగిన భేటీ గురించి అంతర్జాతీయ మీడియాలో చర్చ జరిగింది. అదే సమయంలో నరేంద్ర మోదీ అనేకమంది ప్రపంచ నేతలతో సమావేశమయ్యారు.

రిషి సునక్‌తో మోదీ

రిషి సునక్‌తో మోదీ భేటీ

జీ20లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌, భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి(ఎఫ్‌టీఏ) సంబంధించిన చర్చల విజయవంతానికి వీలైనంత త్వరగా కృషి చేయాలని బ్రిటన్ పట్టుదలతో ఉందని సునక్ మోదీతో అన్నారు. గత నెలలోనే చాలా వరకు చర్చలు పూర్తి అయ్యాయి.

దీపావళి లోగా ఎఫ్‌టీఏకు తుదిరూపు ఇవ్వాలని ఇరు దేశాలు ఏప్రిల్‌లోనే గడువును నిర్దేశించుకున్నాయి. కానీ, కొన్ని సమస్యలపై విభేదాల కారణంగా ఒప్పందం ఖరారు కాలేదు. ఇప్పుడు సునక్, మోదీల సమావేశం తర్వాత ఆ ఒప్పందానికి త్వరలోనే తుదిరూపు వచ్చే అవకాశం ఉంది.

రిషి సునక్‌తో మోదీ

జీ20లో తొలిసారి భారత ప్రధాని మోదీతో ఎఫ్‌టీఏ గురించి చర్చించినట్లు హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రిటన్ ప్రధాని సునక్ చెప్పారు.

''నేను, భారత ప్రధాని మోదీతో స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చించా. వీలైనంత త్వరగా దీనికో అర్థవంతమైన ముగింపు ఇచ్చే దిశగా కదలాలని మా టీమ్‌లను కోరాం. భారత్‌తో మన భాగస్వామ్యం వ్యాపార ప్రయోజనాలకు మించినది’’ అని సునక్ అన్నారు.

అంతేకాకుండా వీరిద్దరి సమావేశం జరిగిన కొన్ని గంటలకే 3000 మంది భారతీయులకు ప్రొఫెషనల్ వీసాలను జారీ చేస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ వీసాల ద్వారా 3000 మంది భారతీయులు రెండేళ్ల పాటు బ్రిటన్‌లో పనిచేసేందుకు వీలు కలుగుతుంది.

మోదీ

మిజోరమ్‌లో జీ20 సదస్సు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో జరుగనున్న 18వ జీ20 సదస్సు ఆతిథ్య బాధ్యతలు తీసుకుంటూ..భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో జీ20 సదస్సును నిర్వహిస్తామని అన్నారు.

2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు.

ఈశాన్య భారత్‌లో రాబోయే జీ20 సమావేశాలను నిర్వహిస్తామని, నాగాలాండ్ రాజధాని ఐజ్వాల్‌ కూడా ఇందుకు వేదికగా మారుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

భారత్‌లోని 55 ప్రాంతాల్లో 200 సమావేశాలు నిర్వహించనున్నట్లు మీడియాతో కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో ఐజ్వాల్ కూడా ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఐజ్వాల్‌లో కనీసం ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ కూడా లేదని, ఈ దిశగా తాను ప్రయత్నాలు చేస్తానని మిజోరమ్ పర్యాటక మంత్రి రాబర్ట్ రోమావియా అన్నారు.

రాబోయే కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు సెక్టారును ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is Modi becoming a global leader, why America showered praises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X