కేక్ ఆర్డర్ చేసిన ఢిల్లీలోని పాక్ హై కమిషనర్- దేశం కన్నీరు పెడుతోంటే

Pahalgam Terror Attack: పాకిస్తాన్ తన శాడిజాన్ని బయటపెట్టుకుంది. తన తెంపరితనాన్ని చాటుకుంది. జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తరువాత యావత్ దేశం కన్నీరు పెడుతోంటే- తాను మాత్రం పండగ చేసుకుంటోంది. అది కూడా భారత గడ్డ మీదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కన్నుమూసిన 27 మంది భౌతికకాయాలు స్వస్థలాలకు చేరుకుంటోన్నాయి. నౌకాదళానికి చెందిన లెప్టినెంట్ వినయ్ నర్వాల్ సహా ఏపీ, కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన సాధారణ పౌరులు ఉగ్రవాదుల ఘాతుకానికి బలి అయ్యారు.

Is Pak High Commission in New Delhi celebrated Pahalgam Terrorist attack with Cake

వారి భౌతికకాయాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలన్నీ కూడా శోకసముద్రంలో మునిగిపోయాయి. తమ ఆప్తులకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. పహల్గామ్ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం అనేది బహిరంగ రహస్యమే.

దీన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ డిప్లొమాట్‌ సాద్ అహ్మద్ వరాయిచ్‌కు సమన్లు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణాయలతో కూడిన అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది. దీనికి గల కారణాలను వివరించింది.

ఈ బాధాకర పరిస్థితుల మధ్య ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం మాత్రం సంబరాలను జరుపుకొంటోదంటూ వార్తలు వెల్లువెత్తాయి. కేక్‌ను ఆర్డర్ చేసింది హైకమిషన్ ఆఫీస్. పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్‌‌ను తీసుకెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆఫీస్‌లోకి కేక్‌ను పట్టుకెళ్తోన్న వ్యక్తిని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. వాళ్లు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా అతను బదులు ఇవ్వలేదు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి చెందిన వ్యక్తివా? కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇవ్వలేదతను.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+