షాకింగ్: రాజకీయాలపై రజనీకాంత్ ఆలస్యం, బీజేపీ ఒత్తిడి? 'అలా ఐతే అవసరమే లేదు'

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో భేటీ అవుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన కలవనున్నారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి అడగగా... ఈ నెల 31వ తేదీన చెబుతానని వెల్లడించారు. దీంతో ఆయన ఏం చెబుతారోననే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది.

ముఖ్యంగా తమిళనాట ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారా, రారా, వస్తే ఎలా ఉంటుందనే అంశాలపై చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. రజనీ రాజకీయ ఆరంగేంట్రానికి బీజేపీకి లింక్ పెడుతూ ప్రచారం సాగుతోంది.

రజనీకాంత్-పవన్ కళ్యాణ్: అక్కడే ఇద్దరి మధ్య తేడా! దానికి జనసేనాని ఫుల్‌స్టాప్

అభిమానులతో వరుస భేటీ

అభిమానులతో వరుస భేటీ

రజనీకాంత్ మంగళవారం నుంచి అభిమానులతో భేటీ అవుతున్నారు. ఆరు రోజుల పాటు అభిమానులను కలుస్తారు. ఈ కలయికను కేవలం అభిమానుల కార్యక్రమంగానే చూడాలని, రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేయడానికి దీనికి సంబంధం లేదని కొందరు అంటున్నారు. అదే సమయంలో ఆయన అభిప్రాయ సేకరణ చేస్తున్నారని అంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన

ఈ నెల 31వ తేదీన రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని రజనీ చెప్పారు. ఆ మాట చెప్పారంటే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకొని ప్రకటన చేసేందుకు 31వ తేదీ వరకు ఆగమని చెప్పారని అంటున్నారు. ప్రకటన ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఆలోచన కొంతైనా ఉండి ఉంటుందని, అందుకే అలా చెప్పారని అంటున్నారు.

బీజేపీతో కలిసి సాగుతారని

బీజేపీతో కలిసి సాగుతారని

రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి ఏళ్లుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు మరింత ఎక్కువైంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఆయనను కలిశారు. ఆయన బీజేపీలో చేరుతారని అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుగా పార్టీ పెడతారని, బీజేపీలో చేరుతారని, కాదు.. కాదు ఆయన సొంతగానే పార్టీ ఆలోచన చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

అలా ఐతే రజనీకాంత్ రావొద్దు

అలా ఐతే రజనీకాంత్ రావొద్దు

గత ఏడాదిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మరింత ఎక్కువగా సాగుతోంది. అయితే 31న ప్రకటన చేస్తానని, రాజకీయాలు తనకు కొత్త కాదని రజనీ రెండు రోజుల క్రితం చెప్పినప్పటి నుంచి చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై బెంగళూరుకు చెందిన ఓ రాజకీయ పరిశీలకులు మాట్లాడుతూ.. గెలుపు కోసమే ఆయన మాట్లాడితే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, రాజకీయాలు అంటే గెలుపు కాదని, అంతకంటే ఎక్కువ అని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం ఉంటే ఎన్నికల గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

రజనీకాంత్‌పై ఏదో ఒత్తిడి

రజనీకాంత్‌పై ఏదో ఒత్తిడి

మరో రాజకీయ పరిశీలకులు మాట్లాడుతూ.. రజనీకాంత్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని, ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే ఏ పని అయినా చేస్తాడని, అతని పైన ఏదో ఒత్తిడి ఉండి ఉంటుందని, అది రాజకీయపరమైన ఒత్తిడి కావొచ్చునని అభిప్రాయపడ్డారు.

బీజేపీలో చేరమని ఒత్తిడి?

బీజేపీలో చేరమని ఒత్తిడి?

మరోవైపు, తమిళనాడులో ఎదగాలనుకుంటున్న బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. రజనీకాంత్ వంటి నేత బీజేపీకి అనుకూలంగా ఉంటే అంతకంటే ఏం కావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీలో చేరమని ఆయనపై ఒత్తిడి ఉందని చెబుతున్నారు. అలాగే తమిళనాట తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ కారణాల వల్లే ఆయన రాజకీయ ఆరంగేట్రం ఆలస్యం అవుతుందా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం దేవుడు తనను యాక్టర్‌గా ఉండమని చెప్పారని, దేవుడు కోరుకుంటే రేపు రాజకీయాల్లోకి రావొచ్చు అని రజనీ చెప్పి నెలలు అయింది. కానీ క్లారిటీ రాలేదు. దీనికి బీజేపీ ఒత్తిడే కారణం కావొచ్చని అంటున్నారు. రజనీ మాత్రం ప్రస్తుతానికి అన్ని పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On Wednesday, superstar Rajinikanth met his fans in Chennai, the capital city of Tamil Nadu, for the second day in a row. The 67-year-old maintains that the six-day long schedule, which started on Tuesday, is purely an exercise to personally meet and greet his fans and it should not be seen as a political event.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి