ఈవీఎంల రిగ్గింగులో ప్రమేయం ఉందా? సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టు వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న పిల్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడంపై వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల డిమాండ్‌ను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోవడంలేదన్న ఆయన.. రిగ్గింగ్‌లో కోర్టు సైతం పాలుపంచుకుందా అని ప్రశ్నించారు.
మూడు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియతో పాలన అటకెక్కిందన్న విషయం సుప్రీంకోర్టు మర్చిపోయిందని ఉదిత్ రాజ్ అభిప్రాయపడ్డారు. మరో రెండు ముడ్రోజులు ఓట్ల లెక్కింపులో జాప్యాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. లెక్కించే వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలని కోరుతూ 22 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. ఓట్ల లెక్కింపులో జాప్యం చేసుకుంటుందని న్యాయస్థానం తిరస్కరించడాన్ని ఉదిత్ రాజ్ తప్పుబట్టారు.

మూడు నెలల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఉదిత్ రాజ్ విమర్శించారు. స్లిప్పుల లెక్కింపునకు మరో ఒకట్రెండు రోజులు సమయంపడితే ఏమవుతుందని ప్రశ్నించారు. తాను సుప్రీంకోర్టుపై ఎలాంటి ఆరోపణలు చేయడంలేదని, తన ఆందోళనను మాత్రమే వెలిబుచ్చుతున్నానని స్పష్టం చేశారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications