• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ విమర్శలు: రాహుల్‌గాంధీని బీజేపీ టార్గెట్ చేసిందా..?

|

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీని భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్ ఏవిధంగా అయితే టార్గెట్ చేసిందో...ఇప్పుడు అదే హస్తం పార్టీని రాహుల్ గాంధీని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందా...అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌ను విమర్శించి ప్రజల్లో బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల్లోకి బీజేపీ కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలు మాత్రం వెళుతున్నాయి కానీ... ప్రజలు మాత్రం రివర్స్ అవుతున్నారు.

మోడీపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు ఇవే..!

మోడీపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు ఇవే..!

ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే ప్రధాని నరేంద్ర మోడీని అన్ని రాజకీయపార్టీలు టార్గెట్ చేశాయి. దేశంలో సంభవిస్తున్న మరణాలకు మాస్టర్‌గా మోడీ ఉన్నారని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ధ్వజమెత్తగా.. మరికొందరు ఒక అడుగుముందుకేసి మరింత ప్రమాదకరమైన పదజాలాన్ని మోడీపై ప్రయోగించారు. ప్రియాంకా గాంధీ నీచ్ అని మోడీని తిట్టిపోశారు. మరో మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ మాత్రం గలీజ్ వ్యక్తి అని దుమ్మెత్తి పోశారు. మరో కేంద్ర మాజీ మంత్రి బేనీప్రసాద్ వర్మ మోడీని పిచ్చికుక్క అని సంబోధించారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మోడీని రావణుడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి మోడీని దావూద్ ఇబ్రహీంగా పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి ప్రధాని మోడీని భస్మాసుర అని పిలిచారు. ఇక సల్మాన్ ఖుర్షీద్ మోడీని ఖల్‌నాయక్ అని పిలువగా... నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లా మోడీని నియంతగా అభివర్ణించారు. అయితే నేతల మోడీపై ఎక్కుపెట్టిన పదాస్త్రాలు కచ్చితంగా మోడీపై సానుభూతిని క్రియేట్ చేశాయని కొందరు చెబుతున్నారు.

మోడీపై ప్రజల్లో సానుభూతి

మోడీపై ప్రజల్లో సానుభూతి

మోడీని అన్ని వైపుల నుంచి విపక్షాలు టార్గెట్ చేస్తుండటంతో అతనిపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఇంత మంది అన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ...రకరకాల పేర్లతో మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నప్పటికీ ఆయన వాటిని సీరియస్‌గా తీసుకోకపోవడం తిరిగి విమర్శించడంలాంటివి చేయకపోవడంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి మరింత పెరిగిందన్నారు.

 రాహుల్ గాంధీపై బీజేపీ తిట్ల దండకం

రాహుల్ గాంధీపై బీజేపీ తిట్ల దండకం

ఇక రాహుల్ గాంధీపై బీజేపీ వారు కూడా విమర్శలు ఎక్కు పెట్టారు. రాహుల్ గాంధీని విదూషకుడని అభివర్ణించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీ మంద బుద్ధి కలిగిన వాడు అని ఛత్తీస్‌గఢ్ ఎంపీ సరోజ్ పనే అన్నారు. రాహుల్ గాంధీకి మరో జన్మ ఉండదని మరో బీజేపీ ఎంపీ చౌదరి బాబూలాల్ విమర్శించారు. రాహుల్ గాంధీ నాటి మొఘల్ రాజు బాబర్‌కు భక్తుడని, ఖిల్జీకి బంధువు అయి ఉంటాడని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక కుట్రదారుడు నమ్మకద్రోహి అంటూ బార్మర్ ఎమ్మెల్యే కైలాష్ చౌదరి అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి రాహుల్‌ను ఉద్దేశించి వివాదాస్పద విమర్శలు చేశారు. రామ్జాదా వర్సెస్ హరామ్ జాదా అనే తిట్ల పురాణం ఆమె అందుకున్నారు. ఇక సాక్షి మహారాజ్ అయితే రాహుల్ గాంధీని ఒక పిచ్చిపట్టిన వ్యక్తిగా అభివర్ణించారు.

ఇదిలా ఉంటే బీజేపీ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా వారికి మేలు చేకూర్చవని తిరిగి బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయని ప్రజలు ఆమోదించరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో బీజేపీ ఇలా విమర్శించి కొంత లాభపడ్డారని అయితే ఈసారి స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Has the ruling Bharatiya Janata Party (BJP) taken the same route as taken by the Congress before and during the 2014 Lok Sabha elections in the country when it unscrupulously attacked the then Gujarat chief minister and present PM Narendra Modi or the BJP is trapped by the Congress moves? Actually Congress president Rahul Gandhi is similarly targeted by all and sundry in the BJP the way Modi was attacked by the Congress. But the question is, if it is making any impact on people or not? Yes it is making its impact but not as desired by the BJP rather adverse!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more