వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్రత్ జహాన్ కేసు: అమిత్ షాకు సిబిఐ క్లీన్‌చిట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షాకు సిబిఐ బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది. కేసులో సరైన ఆధారాలు లేని కారణంగా అతనికి క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది.

సోహ్రాబుద్దీన్, తుల్సిరామన్ ప్రజాపతి హత్య, ఎన్‌కౌంటర్ అభియోగాలను కూడా అమిత్ షా ఎదుర్కొంటున్నారు. కాగా, ప్రస్తుతం అమిత్ షా ఉత్తరప్రదేశ్ బిజెపి ఎన్నికల ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Ishrat Jahan encounter case: CBI gives 'clean chit' to Modi aide Amit Shah

ఏప్రిల్ 28న కేంద్రమంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఇష్రత్ జహాన్‌ది బూటకపు ఎన్‌కౌటర్ అని, ఈ కేసులో ఆధారాలున్నప్పటికీ నరేంద్ర మోడీ, అమిత్ షాలు రక్షణ పొందుతున్నారని ఆరోపించారు. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపణలు రావడంతో సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జీ షీటులో ఏ రాజకీయ నాయకుడి పేరు ప్రస్తావించలేదు.

అయితే పోలీసులు, ఐబి అధికారులపై హత్య, నేరాభియోగాలు నమోదయ్యాయి. నలుగురు ఐబి అధికారులతోపాటు 11 మంది పోలీసు అధికారులపై సిబిఐ ఛార్జీషీటు నమోదు చేసింది. ఈ కేసులో నలుగురు సామాన్యులు మరణించినందువల్ల వీరిపై అభియోగాలు నమోదు చేసింది.

English summary
The CBI on Wednesday told a special court that no sufficient evidence has been found against former Gujarat minister Amit Shah in the Ishrat Jahan encounter case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X