షాక్: బిజెపి నేతల హత్యలకు ఐఎస్ఐ కుట్ర?

బిజెపికి చెందిన సీనియర్ నేతలను, మంత్రులను, ముఖ్యమంత్రులను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నట్లు ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: బిజెపికి చెందిన సీనియర్ నేతలను, మంత్రులను, ముఖ్యమంత్రులను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నట్లు ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. జైషే ఈ మహ్మద్‌(జేఈఎమ్‌) చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలు ప్రకటించాయి.

దేశంలో ప్రముఖ బిజెపి నేతలను హత్య చేయడం ద్వారా భయోత్పాతం సృష్టించాలని జైషే ఈ మహ్మద్‌ ప్లాన్ చేస్తోందని ఇంటలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ మేరకు జేఈఎమ్‌, లష్కర్‌ ఈ తోయిబా(ఎల్‌ఈటీ)లు కలసి బంగ్లాదేశ్‌ నుంచి కుట్రను అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఇంటలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ISI SENDING SUICIDE SQUAD THROUGH B’DESH TO ATTACK BJP LEADERS: INTEL REPORT

ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు తమ టాస్క్‌ను పూర్తి చేసేందుకు భారత్‌లోకి ప్రవేశించినట్లు ఐబి హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ భద్రతతో తిరుగుతున్న ఓ ప్రముఖ బీజేపీ ముఖ్యమంత్రిని తొలి లక్ష్యంగా ఉగ్ర సంస్థలు నిర్దేశించుకున్నట్లు తెలిసింది. దీంతో అలర్ట్‌ అయిన భారత ఇంటిలిజెన్స్‌ బృందం బంగ్లాదేశ్‌కు చెందిన అధికారుల సాయంతో ఢాకాలోని అనుమానిత ప్రదేశంపై రైడింగ్‌ జరిపించింది.

అయితే, రైడింగ్‌లో ఎలాంటి సమాచారం దొరకలేదని సమాచారం. మసూద్‌ అజర్‌ మేనల్లుడు(తహ్లా రషీద్‌)ని కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ కుట్ర జరుగుతోందనే సమాచారం కూడా ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+