రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ..భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని కూడా

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం పతక స్థాయిలో కొనసాగుతున్న వేళ.. కీలక దేశాల ప్రధానమంత్రులు, ఇతర ప్రతినిధులు భారత్‌కు బారులు తీరుతున్నారు. అమెరికా, యూరోయన్ యూనియన్‌ ప్రతినిధులతో పాటు బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెలాఖరున వారి పర్యటన ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, జాతీయ భధ్రత సలహాదారు అజిత్ దోవల్‌ను వారు కలుసుకోనున్నారు.

బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్స్, అమెరికా విదేశాంగ శాఖ రాజకీయ వ్యవహారాల విభాగం అండర్ సెక్రెటరీ విక్టోరియా న్యులాండ్, అసిస్టెంట్ సెక్రెటరీ డొనాల్డ్ లు ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శక్తిమంతమైన దేశం కావడం వల్ల భారత్ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నానికి దిగాయి ఆయా దేశాలన్నీ. రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించేలా ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌ను బుజ్జగించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు.

Israel PM Naftali Bennett is all set to his first official visit to India on April 2

ప్రస్తుతం జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ భారత్‌లో పర్యటిస్తోన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఆ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలతో పాటు రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. ప్రపంచ దేశాలపై దాని పరిణామాలు వంటి అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇవ్వాళ కిషిడ 14వ భారత్-జపాన్ వార్షిక ఉన్నతస్థాయి సదస్సులో పాల్గొననున్నారు.

అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ కూడా భారత పర్యటనకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. నాలుగు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారు. దీనికోసం ఆయన ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. 5వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలు అత్యున్నత స్థాయి సమ్మిట్‌లల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమౌతారు. ద్వైపాక్షిక సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిణామాలపై చర్చిస్తారు.

నఫ్తాలి బెన్నెట్‌ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. అలాగే- ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఓ దేశంలో పర్యటించడం కూడా ఆయనకు ఇదే తొలిసారి. తమ దేశ పర్యటనకు రావాలంటూ నరేంద్ర మోడీ ఆయనను ఆహ్వానించారు. దీనికి అంగీకరించారాయన. యుద్దం కొనసాగుతున్న సమయంలోనే తన భారత పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. తన పర్యటన సందర్భంగా ఇక్కడ స్థిరపడిన యూదు సంఘాల ప్రతినిధులను బెన్నెట్ కలుసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+