Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిఎస్ఎల్వీ సి25 సక్సెస్: అమెరికా సరసన భారత్

శ్రీహరికోట: పిఎస్ఎల్వీ సి25 ప్రయోగం విజయవంతమైంది. మార్స్ ఆర్పిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న పిఎస్ఎల్వీ సి25 మంగళవారం మధ్యాహ్నం గం.2.38 నిమిషాలకు నింగికెగిసింది. కీలకమైన నాలుగు దశలు పూర్తి కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందనలు తెలిపారు. సమష్టి కృషితో విజయం సాధించామన్నారు.

మామ్ 24 సెప్టెంబర్ 2014న కక్షలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగాన్ని కేంద్రమంత్రి నారాయణ స్వామి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ ప్రత్యక్షంగా వీక్షించారు. మామ్ సుమారు 35 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్ ద్వారా పంపించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం బరువు 1337 కిలోలు. అందులో ఉపగ్రహం నికర భారం కేవలం 482 కిలోలు మాత్రమే కాగా, మిగిలిందంతా ద్రవ రూప ఇంధనమే. భువిపై ప్రయోగించిన నలభై నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి చేరనుంది. అనంతరం సుమారు మూడువారాలపాటు భూకక్ష్యలోనే కొనసాగి, తరువాత అంగారకుడి దిశగా పయనం సాగిస్తుందని శాస్తవ్రేత్తలు చెపుతున్నారు.

ISRO launches Mars Orbiter Mission

300 రోజుల తరువాత అంగారకుడి కక్ష్యలోకి చేరుకోనుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూమి, అంగారక గ్రహాల మధ్య గమన దూరం రెండేళ్లకో పర్యాయం తక్కువవుతుంది. సరిగ్గా ఆ సందర్భంలోనే ఇస్రో పంపించనున్న ఉపగ్రహం అంగారకుడి గమనంలోకి చేరుకోనుండటం గమనార్హం. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం ముగిసింది.

ఇస్రో చేపడుతున్న తొలి గ్రహాంతర ప్రయోగం ఇదే. అంగారక యాత్ర ప్రాజెక్టును రూ.450 కోట్లతో చేపట్టారు. మామ్ తయారీకి రూ.150 కోట్లు, పిఎస్ఎల్వీకి రూ.110 కోట్లు, ఇతరత్రా ఖర్చులకు రూ.190 కోట్లు వ్యయం చేశారు. ఇస్రో చేపడుతున్న తొలి గ్రహాంతర ఉపగ్రహం ఇదే.

<center><center><center><center><center><center><center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7DcSDOkDvyQ?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center></center></center></center>

అంగారకుడి మీద ఉండే జీవరాసులు తదితరాలు మానవాళికి ఉపయోగపడతాయా? లేదా? ఉపయోగపడితే అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న అంశంపై 1337 కిలోల బరువుగల మార్స్ మిషన్‌ను ప్రయోగిస్తున్నారు. ఉపగ్రహంలో అమర్చిన 5 పరికరాలు అక్కడుండే జీవరాసులపై అనే్వషణ, వాతావరణ అధ్యయనం, ఖనిజ సంపద, హైడ్రోజన్, తటస్థ అణువులు, అంగారక భూతలం జాడలు వంటివాటిపై పరిశోధన చేసి ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలతో తెలిజేసే విధంగా ఉపగ్రహాన్ని రూపొందించారు.

ఇప్పటికే రష్యా, యూరప్, అమెరికావంటి దేశాలు అంగారక గ్రహ యాత్ర చేశాయి. ఇది విజయవంతమైతే అగ్రదేశాల సరసన భారత్ నిలవనుంది. ప్రయోగం అనంతరం ఉపగ్రహం మొత్తం తొమ్మిది నెలలో కాలంలో 35 వేల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారక గ్రహ కక్ష్యలోకి చేరుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.450కోట్లు.

కాగా, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సోమవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. పిఎస్‌ఎల్‌వి సి-25 ఉపగ్రహం ప్రయోగం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పాదాల చెంత ఉపగ్రహ నమూనాలను ఉంచి పూజలు చేశారు. రాకెట్ విజయం కోసం ఇస్త్రో చైర్మన్ ముందుగా చెంగాళమ్మ అమ్మవారికి పూజలు చేశారు. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 25వ ప్రయోగం కావడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+