పీఎస్ఎల్వీ-సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం: ఇస్రో శాస్త్రవేత్తల హర్షం(వీడియో)

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూన్ 30, 2022న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి DS-EO ఉపగ్రహాన్ని, మరో రెండు సహ-ప్రయాణికుల ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్‌ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జరిగింది.

Recommended Video

    పీఎస్ఎల్వీ-సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం *Science | Telugu Oneindia

    గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగిన తర్వాత వాహకనౌక నింగిలోకి పయనించింది.

    ISRO Launches PSLV-C53 Mission With three Satellites From Sriharikota Space Centre

    PSLV-C53 అని పిలవబడే మిషన్.. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) రెండవ అంకితమైన వాణిజ్య మిషన్ ఇది. సింగపూర్‌కు చెందిన మరో రెండు సహ ప్రయాణీకుల ఉపగ్రహాలతో పాటు DS-EO ఉపగ్రహాన్ని తక్కువ-భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

    డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్ ను కలిగివుంది. ఎన్ఇయూఎస్ఏఆర్ అనేది ఎస్ఏఆర్ పేలోడ్ ను మోసుకెళ్లే సింగపూర్ కు చెందిన మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, పీఎస్ఎల్వీ ప్రయోగంలో ఇది 55వ ప్రయోగం. కాగా, "PSLV-C53/DS-EO మిషన్ విజయవంతంగా పూర్తయింది" అని PSLV-C53 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత, ISRO ట్విట్టర్‌లో పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+